అల్లు vs యశ్.. గొడవ ఎటు పోతోంది?
అయినా చాలా మీడియా పేజీలు పాత అల్లు అరవింద్ వీడియోను పక్కన పెట్టి, “యశ్ తల్లి కౌంటర్” అంటూ ప్రచారం చేస్తున్నాయి. అక్కడి నుంచే విషయం మరోలా మారిపోయింది.
యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. అందులో ఆమె ‘కేజీఎఫ్’కు ముందే తన కొడుకు కన్నడలో వరుస విజయాలు సాధించాడని చెప్పింది. కానీ ఎక్కడా అల్లు అరవింద్ పేరు తీసుకోలేదు. అయినా చాలా మీడియా పేజీలు పాత అల్లు అరవింద్ వీడియోను పక్కన పెట్టి, “యశ్ తల్లి కౌంటర్” అంటూ ప్రచారం చేస్తున్నాయి. అక్కడి నుంచే విషయం మరోలా మారిపోయింది.
అల్లు అరవింద్ 2023లో మాట్లాడిన సందర్భం కూడా యశ్ కెరీర్ గురించి కాదు. పెద్ద సినిమాల బడ్జెట్ ఎందుకు పెరుగుతోంది, హీరోల పారితోషికమే కారణమా అనే చర్చలో ‘కేజీఎఫ్’ను ఉదాహరణగా తీసుకున్నాడు. సినిమా స్థాయి, నిర్మాణం కూడా హీరో మార్కెట్‌ను పెంచుతాయని చెబుతూ “కేజీఎఫ్‌కు ముందు యశ్ ఎవరు?” అన్నాడు. ఆ ఒక్క లైన్ తీసుకొని కౌంటర్ అన్నట్లు హడావుడి స్టార్ట్ చేశారు.
యశ్ తల్లి ఇప్పుడు చెప్పింది మరో కోణం. ‘కేజీఎఫ్’కు ముందే ‘గూగ్లీ’, ‘డ్రామా’, ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’, ‘గజకేసరి’ లాంటి సినిమాలతో తన కొడుకు కన్నడలో పేరు తెచ్చుకున్నాడని గుర్తు చేశారు. బస్ డ్రైవర్ కొడుకుగా వచ్చి తన స్థానం సంపాదించాడని అన్నారు. ఈ మాటలను అల్లు అరవింద్ పాత కామెంట్స్ కలిపి చూడటం మీడియా కథనాల్లో ఎక్కువగా జరిగింది. అయితే ఆమె మాత్రం డైరెక్ట్ గా అల్లు అరవింద్ పేరు మాత్రం చెప్పలేదు.
ఈ మధ్య యశ్ మాటల విషయంలో కూడా దాదాపు ఇదే జరిగింది. ‘టాక్సిక్’ ప్రచారంలో యశ్ వివరణ ఒకటి కూడా ఇలానే వైరల్ అయ్యింది. యశ్ సినిమా విజయంలో నిర్మాత ఒక్కరే కాదు, నటుడు, రచయిత, ఇతర విభాగాల వాళ్లందరి పని ఉంటుందని చెప్పాడు. ప్రేక్షకులు ఎవరిని ఆదరిస్తారో వాళ్లే నిర్ణయిస్తారని అన్నాడు. కానీ ఆ సమాధానం కూడా కొన్ని చోట్ల అల్లు అరవింద్‌కు యశ్ కౌంటర్ అన్న హెడ్డింగులతో వెళ్లింది.
నిజానికి ‘కేజీఎఫ్’కు ముందే యశ్ కన్నడలో విజయాలు అందుకున్న హీరో. అదే ‘కేజీఎఫ్’ తర్వాత అతని మార్కెట్ దేశవ్యాప్తంగా మారింది. అల్లు అరవింద్ మాట్లాడింది సినిమా స్థాయి హీరో మార్కెట్‌ను ఎంత పెంచగలదన్న సందర్భంలో. ఇక యశ్ తల్లి నిజంగానే అల్లు మాటలకు కౌంటర్ ఇచ్చారా లేదంటే మరో సందర్భం ఏదైనా ఉందా అనేది క్లారిటీ లేదు.
ఇప్పుడు ‘టాక్సిక్’ విడుదలైన సమయంలో పాత వీడియోలు మళ్లీ బయటకు రావడంతో ఈ విషయం కొత్త గొడవలా కనిపిస్తోంది. యశ్ ఇప్పటికే తన సమాధానం చెప్పేశాడు. ఇప్పుడు అతని తల్లి మాటలు కూడా వచ్చాయి. కానీ ఇప్పటివరకు అల్లు అరవింద్, యశ్ లేదా పుష్ప ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా ఎలాంటి మాటలు అనుకోలేదు.