వాళ్లిద్దరి మధ్య డైలమాలో పాన్ ఇండియా స్టార్!
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో `టాక్సిక్` కన్నడ, ఇంగ్లీష్ లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.;
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో `టాక్సిక్` కన్నడ, ఇంగ్లీష్ లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. కొన్ని గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యాయి. వాటితో సినిమాపై ఏమంత బజ్ క్రియేట్ అవ్వలేదు గానీ..యశ్ పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నటుడు కావడంతో? గ్లింప్స్ తోనే డిసైడ్ అవ్వాల్సిన పనిలేదు అన్న కాన్పిడెన్స్ తో అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ ని తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది.
భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ తెచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ గ్లింప్స్ కు రవి బస్రూర్ స్కోర్ అందించాడని ప్రచారం జరిగింది. స్కోర్ పరంగా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో పాటల వరకూ అనిరుద్.. కొంత మేర ఆర్ ఆర్ వరకూ రవిని కొనసాగిస్తారే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట సర్క్యూలేట్ అవుతుంది. సినిమాకు సంబంధించి మొత్తం బాధ్యతలు రవి బస్రూర్ కి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య రెగ్యులర్ గా యశ్ ..రవికి టచ్ లో ఉంటున్నాడని...సంగీతానికి సంబంధించిన డిస్కషన్స్ చేస్తున్నాడనే వార్తలు కన్నడ మీడియాలో వైరల్ గా మారాయి.
మరి ఈ ప్రచారంలో నిజా నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. యశ్-రవి బస్రూర్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `కేజీఎఫ్` పాన్ ఇండియాలో ఎంత సంచలనమైందో తెలిసిందే. హీరో కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు రవి బస్రూర్. కథకి అతడి ఆర్ ఆర్ కూడా తోడవ్వడంతో బ్లాక్ బస్టర్ అయింది. ఆర్ ఆర్ తోనే సినిమాను అంతకంతకు పైకి లేపాడన్నది వాస్తవం. అదే నమ్మకంతో యశ్ మరోసారి రవి వైపు చూస్తున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అనిరుద్ కూడా తక్కువేం కాదు. ఆర్ ఆర్ తోనే బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సంగీత దర్శకుడు. ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో నిలిచిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా అతడే. ఆ వేవ్ చూసే అతడి కోసం తెలుగు దర్శకులు కూడా పోటీ పడ్డారు. స్టార్ హీరోలు కూడా అనిరుద్ కావాలంటూ పట్టుబట్టారు. అలాంటి సంచలనం విషయంలో? యశ్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నాడు? అన్నది ఆలోచించాల్సిన విషయమే. ప్రస్తుతం అనిరుద్ చేతిలో చాలా సినిమాలున్నాయి. తమిళ్తో పాటు తెలుగు సినిమాలకు పని చేస్తున్నాడు.