యష్ vs అల్లు.. ఏంటీ గొడవ?
రెండింటినీ పక్కపక్కన పెట్టడంతో అరవింద్‌కు యష్ కౌంటర్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ అసలు సందర్భం చూస్తే ఇద్దరి మాటల మధ్య గొడవే లేదు.
అల్లు అరవింద్, యష్‌కు సంబంధించిన రెండు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఒక క్లిప్‌లో ‘KGF’కు ముందు యష్ ఎంత పెద్ద హీరో అని అరవింద్ ప్రశ్నిస్తుంటే.. మరో క్లిప్‌లో సినిమా ఒక్కరి కష్టం కాదంటూ యష్ మాట్లాడుతున్నాడు. రెండింటినీ పక్కపక్కన పెట్టడంతో అరవింద్‌కు యష్ కౌంటర్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ అసలు సందర్భం చూస్తే ఇద్దరి మాటల మధ్య గొడవే లేదు.
అల్లు అరవింద్ కామెంట్స్ 2023లో చేసినవి. పెద్ద సినిమాల బడ్జెట్లు, హీరోల రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయన ‘KGF’ను ఉదాహరణగా తీసుకున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు భారీ సినిమాలను ఆదరించాలంటే వాటిని తెరపై కూడా పెద్దగా చూపించాల్సి ఉంటుందని చెప్పారు. అది ఏ హీరో సినిమా అన్నది ఒక్కటే లెక్క కాదని చెబుతూ.. “KGF రాకముందు యష్ ఎవరు? ఎంత పెద్ద హీరో?” అని ప్రశ్నించారు.
అరవింద్ ఉద్దేశం యష్‌ను తక్కువ చేయడం కాదు. పెద్ద స్టార్ ఉంటేనే భారీ సినిమా ఆడుతుందనే లెక్క కరెక్ట్ కాదన్నది ఆయన పాయింట్. ‘KGF’ను పెద్ద స్థాయిలో తీశారు, ప్రేక్షకులకు కూడా అదే స్థాయిలో చూపించారు కాబట్టే సినిమా అంత పెద్ద విజయాన్ని అందుకుందనేలా ఓ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. యష్ అప్పటికే కన్నడలో హీరోగా ఉన్నా.. ‘KGF’ తర్వాత వచ్చిన దేశవ్యాప్త క్రేజ్ వేరే స్థాయి అన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ‘టాక్సిక్’ ప్రమోషన్స్ సమయంలో యష్ ముందు అరవింద్ పాత కామెంట్‌ను ప్రస్తావించారు. దానికి యష్ కూడా కోపంగా స్పందించలేదు. సినిమా ఒక్క హీరోదో, నిర్మాతదో కాదని.. దర్శకుడు నుంచి ప్రతి టెక్నీషియన్ వరకు అందరి ప్రతిభ కలిసి పనిచేస్తుందని చెప్పాడు. అదే సమయంలో ఆ మొత్తం పనిని పాత్ర ద్వారా ప్రేక్షకుడి వరకు తీసుకెళ్లే బాధ్యత నటుడిపై ఉంటుందని తన అభిప్రాయం చెప్పాడు. నటుడు ఆ పాత్రను సరిగ్గా మోయలేకపోతే మిగతా కష్టం కూడా పూర్తిగా తెరపైకి రాదన్నది యష్ మాట.
ప్రేక్షకులకు ఎవరి పనికి ఎంత గౌరవం ఇవ్వాలో బాగా తెలుసని కూడా అన్నాడు. అంటే అరవింద్ చెప్పింది తప్పు అని ఎక్కడా అనలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రశ్నకు సినిమా విజయంపై తన అభిప్రాయం చెప్పాడు అంతే. కానీ 2023లోని అరవింద్ మాటలకు 2026లోని యష్ సమాధానాన్ని మిక్స్ చేయడంతో కథ మారిపోయింది. ఒకరు సినిమా స్కేల్ గురించి మాట్లాడారు. మరొకరు ఆ సినిమాలో నటుడు సహా మొత్తం టీమ్ పాత్ర గురించి చెప్పారు. రెండు మాటల్లోనూ వాటివాటి లాజిక్ ఉంది. మధ్యలో కౌంటర్ లేదు.. వివాదం లేదు. సోషల్ మీడియాలో క్లిప్స్ కలిసేసరికి మాత్రం కొత్త గొడవ పుట్టుకొచ్చింది.