యష్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ భలే ప్లాన్ చేశారే!
కొన్ని పోస్టర్లలో యష్ తన సన్నిహితులతో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోల్లో యష్ స్నేహితుల శుభాకాంక్షలతో అని అర్థమొచ్చేలా కన్నడలో మెసేజ్ కూడా ఉంది.;
కన్నడ రాక్ స్టార్ యష్ జనవరి 8న తన 40వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. యష్ 40వ బర్త్ డే సందర్భంగా బెంగుళూరులోని ఆయన ఫ్యాన్స్ స్పెషల్ గా డిజైన్ చేసిన పోస్టర్లను ట్రైన్ పై అతికించి, బెంగుళూరు మెట్రోని ఓ ట్రిబ్యూట్ గా మార్చారు. 40వ బర్త్ డే ని మైల్ స్టోన్ బర్త్ డే గా భావించి ఫ్యాన్స్ నగరవ్యాప్తంగా ఓ రోజు ముందుగానే మెట్రో ట్రైన్ కు యష్ పోస్టర్లను అతికించి ఈ బర్త్ డే ను మరింత స్పెషల్ గా మార్చారు.
ఇదంతా చూస్తుంటే యష్ కు తన సొంత నగరంలో ఎలాంటి అభిమానులున్నారో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుండగా, ఆ వీడియోలో ఫ్యాన్స్ మెట్రో ట్రైన్ పై పోస్టర్లను అతికిస్తూ కనిపించారు. ఈ విజువల్స్ లో స్పెషల్ గా డిజైన్ చేసిన యష్ ఫోటోలు, అతని అప్‌కమింగ్ ఫిల్మ్ టాక్సిక్ లోని కొన్ని స్టిల్స్, మరికొన్ని పర్సనల్ ఫోటోస్ ఉన్నాయి.
ట్రిబ్యూట్ గా మారిన బెంగుళూరు మెట్రో
కొన్ని పోస్టర్లలో యష్ తన సన్నిహితులతో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోల్లో యష్ స్నేహితుల శుభాకాంక్షలతో అని అర్థమొచ్చేలా కన్నడలో మెసేజ్ కూడా ఉంది. ఈ వీడియోను టాక్సిక్ చిత్ర మేకర్స్ ఎక్స్ లో షేర్ చేస్తూ హిస్టరీలో మొదటిసారి, బెంగుళూరు మెట్రో ఓ ట్రిబ్యూట్ గా మారింది, యష్ బర్త్ డే కు ఫ్యాన్స్ మెట్రోను తమ ఆధీనంలోకి తీసుకున్నారు అని రాసుకొచ్చారు.
యష్ బర్త్‌డే సందర్భంగా టాక్సిక్ టీజర్?
ఇక టాక్సిక్ విషయానికొస్తే ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో యష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయంపైనే ఇప్పుడందరి దృష్టి నెలకొంది. టాక్సిక్ వరల్డ్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి యష్ 40వ పుట్టిన రోజు కంటే మంచి సందర్భం ఉండదని చిత్ర యూనిట్ భావిస్తున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. కాగా టాక్సిక్ టీజర్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో యష్ క్యారెక్టర్ అతని గత సినిమాల పాత్రలకు పూర్తి భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.