కొత్త ట్రెండ్‌పై ఆసక్తి చూపని సూపర్ స్టార్..!
షారుఖ్ ఖాన్ మాత్రమే కాకుండా మరికొందరు స్టార్స్ సైతం ఇప్పటి వరకు పాడ్ కాస్ట్‌లకు హాజరు కాలేదు.
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఒకానొక సమయంలో హర్రర్ సినిమాలు బాక్సాఫీస్‌ను దున్నేస్తే, మరో సమయంలో యాక్షన్ సినిమాలు, ఒకసారి ఫ్యామిలీ సినిమాలు, కొన్ని సార్లు లవ్ అండ్ రొమాంటిక్ సినిమాల ట్రెండ్ నడవడం జరుగుతుంది. కేవలం సినిమాల ఎంపిక విషయంలోనే కాకుండా ఇంకా చాలా రకాల ట్రెండ్స్ ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం. నటీనటుల ఔట్ ఫిట్ మొదలుకుని, వారి లైఫ్ స్టైల్ వరకు ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ వస్తూ ఉంటుంది. అంతే కాకుండా అభిమానులకు దగ్గరగా ఉండటంలోనూ స్టార్స్ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో కావడం మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు స్టార్స్ వార్తా పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా అభిమానులకు దగ్గరగా ఉండేవారు, ఆ తర్వాత శాటిలైట్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు చేరువ అయ్యేవారు.
కొత్త ట్రెండ్‌తో అభిమానులతో స్టార్స్...
ఇప్పుడు కొత్త ట్రెండ్ ప్రకారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో రెగ్యులర్‌గా స్టార్స్ టచ్‌లో ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా రెగ్యులర్‌గా పోస్ట్‌లు పెట్టి అభిమానులను పెంచుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. తమ సినిమాలకు సంబంధించిన విషయాలను సైతం సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఇక సినిమాల ప్రమోషన్ సమయంలో ఇంతకు ముందు ఇంటర్వ్యూలు ఇచ్చే వారు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇంటర్వ్యూల ప్లేస్‌లో పాడ్‌కాస్ట్‌లు వస్తున్నాయి. ఇంటర్వ్యూలకు పాడ్ కాస్ట్‌లకు పెద్ద తేడా లేదు. అయితే ప్రతి ఒక్కరు ఇప్పుడు పాడ్ కాస్ట్ అంటూ స్టైలిష్ పేరుతో పిలుచుకుంటున్నారు. ఇప్పటికే స్టార్స్ దాదాపు అంతా ఏదో ఒక పాడ్‌కాస్ట్‌లో కనిపించడం జరిగింది. అయితే ఇంకా కొందరు స్టార్స్ మాత్రం పాడ్ కాస్ట్‌లకు అలవాటు కాలేదా అనే అనుమానం కలుగుతుంది.
షారుఖ్ ఖాన్ వ్యక్తిగత విషయాలు...
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇప్పటి వరకు పాడ్‌కాస్ట్‌లు చేయక పోవడం చర్చనీయాంశం అవుతుంది. బాలీవుడ్ వర్గాల్లో ఈ విషయం గురించి చర్చ జరుగుతోంది. ఇటీవల కొందరు హిందీ పాడ్ కాస్ట్ హోస్ట్‌లు షారుఖ్ ఖాన్‌ను కలిసి తమ పాడ్ కాస్ట్‌కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారట. కానీ ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆయనకు పాడ్ కాస్ట్‌లపై ఆసక్తి లేదని కొందరు అంటున్నారు. తన జీవితం మొత్తంను పాడ్ కాస్ట్ ద్వారా చెప్పడం ద్వారా ప్రేక్షకులకు తనపై ఉన్న ఆసక్తి తగ్గుతుందేమో అనే అనుమానం షారుఖ్ ఖాన్‌కి ఉండవచ్చు అని కొందరు అంటూ ఉంటే.. కొందరు మాత్రం షారుఖ్ మనస్థత్వంకు, ఆయన వ్యవహార శైలికి పాడ్ కాస్ట్‌లు సెట్ కావని భావిస్తున్నాడట. అందుకే ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ పాడ్ కాస్ట్‌లకు హాజరు కాలేదు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కింగ్ సినిమాతో క్రిస్మస్ కానుకగా...
షారుఖ్ ఖాన్ మాత్రమే కాకుండా మరికొందరు స్టార్స్ సైతం ఇప్పటి వరకు పాడ్ కాస్ట్‌లకు హాజరు కాలేదు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా స్టార్స్ ఏదో ఒక సమయంలో నడుచుకోక తప్పదు. ఇప్పుడు కాకున్నా కొన్నాళ్ల తర్వాత అయినా జనాల కోసం, తమను అభిమానించే వారి కోసం అయినా కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తమకు తెలిసో లేదా తెలియకుండానో ఆ ట్రెండ్ లోకి, ఆ జోనర్‌లోకి స్టార్స్ అంతా వెళ్లడం కన్ఫర్మ్. కనుక ఈ ఏడాది కాకున్నా కనీసం వచ్చే ఏడాది లేదంటే ఆ తర్వాత ఏడాది అయినా షారుఖ్ పాడ్ కాస్ట్ చేయడం ఖాయం. కేవలం షారుఖ్ ఖాన్ మాత్రమే కాకుండా ఇప్పటి వరకు పాడ్‌కాస్ట్‌లో కనిపించని వారు అంతా కూడా భవిష్యత్తులో కనిపించి వారు నటిస్తున్న సినిమాల గురించి, వారు చేస్తున్న ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకోవడం కన్ఫర్మ్.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. సిద్దార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా, సుహానా ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చెబుతున్నారు. క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్‌లో కింగ్ బరిలోకి దిగబోతున్నాడు. ఆ సమయంలో షారుఖ్ ఏమైనా పాడ్‌కాస్ట్‌లో పాల్గొంటాడేమో చూడాలి.