ఆ ప్రొడ్యూస‌ర్ ఇకపై ప్రాఫిట్స్‌ కోసం సినిమా చేస్తారా?

దాదాపు ప‌దిహేనేళ్ల క్రితం ప్రొడ్యూస‌ర్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కెరీర్ ప్రారంభించారు. చిన్న సినిమాల‌తో పాటు భారీ సినిమాలు నిర్మిస్తూ వ‌స్తున్నారు.;

Update: 2026-01-26 17:30 GMT

టాలీవుడ్‌లో ప్రొడ్యూస‌ర్స్‌ క్రేజీ స్టార్ల‌తో సినిమాలు చేయాల‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్స్‌, సూప‌ర్ హిట్స్‌ని సొంతం చేసుకుని బ్యాన‌ర్ బ్రాండ్ వ్యాల్యూని పెంచుకుని త‌మ కంటూ ప్ర‌త్యేక‌మైన బ్రాండ్‌ని క్రియేట్ చేసుకోవాల‌ని, కోట్ల‌ల్లో లాభాల్ని ఆర్జించాల‌ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. చాలా వ‌ర‌కు ఆ విషయాల్లో స‌క్సెస్ సాధించి నిర్మాత‌లుగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంటుంటారు. కానీ ఓ క్రేజీ ప్రొడ్యూస‌ర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త కొంత కాలంగా చిన్న హీరోల‌ నుంచి క్రేజీ స్టార్ల‌తో సినిమాలు నిర్మిస్తూ వ‌స్తున్నారు.

దాదాపు ప‌దిహేనేళ్ల క్రితం ప్రొడ్యూస‌ర్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కెరీర్ ప్రారంభించారు. చిన్న సినిమాల‌తో పాటు భారీ సినిమాలు నిర్మిస్తూ వ‌స్తున్నారు. వెంక‌టేష్‌తో భారీ సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టారు. అయితే స‌ద‌రు నిర్మాత కెరీర్‌లో హిట్లకంంటే ఫ్లాపులే ఎక్కువ. లాభాల కంటే న‌ష్టాలే ఎక్కువ‌. ఏ సినిమా చేసినా కోట్ల‌ల్లో న‌ష్టాలు.. స‌ర్వ‌సాధ‌ర‌ణంగా మారింది. అయినా స‌రే సదరు నిర్మాత త‌గ్గేదేలే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. మ‌ళ్లీ సినిమా చేయ‌డం న‌ష్ట‌పోవ‌డం..అత‌నికి ఓ అల‌వాటుగా మారింది.

దీంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు షాక్‌కు గుర‌య్యాయి. కోట్లు కోట్లు పెట్టి సినిమాలు చేయ‌డం ఏంటీ న‌ష్టాలు కొనితెచ్చుకోవ‌డం..మ‌ళ్లీ దాన్నిమ‌ర్చిపోయి మ‌రో సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌డం...దాంతో అయినా స‌క్సెస్ సాధించి భారీ లాభాల్ని సొంతం చేసుకుంటున్నాడా? అంటే అదీ లేదు. దాంతోనూ న‌ష్టాలే ఎదుర్కోవ‌డంతో ఇండ‌స్ట్రీలో ఒక్క‌సారిగా చ‌ర్చ మొద‌లైంది. ఈ నిర్మాత ఫ్లాపులు తీసి డ‌బ్బులు పోగొట్టుకోవ‌డానికే సినిమాలు చేస్తున్నాడా? ..బ్లాక్ మ‌నీనీ వైట్ చేసుకునే క్ర‌మంలో ఇలాంటి ప‌నులు చేస్తున్నాడా? అనే చ‌ర్చ మొద‌లైంది.

స‌ద‌రు నిర్మాత కూడా ఆ డౌట్‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తూ న‌ష్టాల కోస‌మే సినిమాలు తీస్తున్న‌ట్టుగా క‌నిపించేవాడు. గోపీచంద్‌తో ఓ భారీ సినిమా చేశాడు. అది మేకింగ్ ద‌శ‌లోనే దీన్ని న‌ష్టాల కోస‌మే తీస్తున్నార‌నే సంకేతాల్ని అందించింది. ఆ త‌రువాత చిరుతో చేసిన త‌మిళ రీమేక్ ప‌రిస్థితి కూడా ఇదే. న‌ష్టాలే ల‌క్ష్యంగా సినిమాలు చేస్తూ వ‌చ్చిన స‌ద‌రు ప్రొడ్యూస‌ర్‌కి రీసెంట్‌గా సంక్రాంతికి హిట్టొచ్చింది. సింపుల్ స్టోరీతో ప‌క్కా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించి వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న నిర్మాత‌కు, ప్రొడ్యూస‌ర్‌కు స‌క్సెస్‌ని అందించింది.

ఈ నేప‌థ్యంలోనే స‌ద‌రు ప్రొడ్యూస‌ర్ ఇక నుంచైనా ఈ సినిమా అందించిన విజ‌యంతో త‌న పంథాని మార్చుకుని ఇక‌పై చేసే సినిమాల‌ని వాంటెడ్‌లీ న‌ష్టాల కోసం కాకుండా ప్రాఫిట్‌ల కోసం చేస్తారా? అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా యంగ్ హీరోతో చేసిన రొమాంటిక్ డ్రామా సూప‌ర్ హిట్ కావ‌డంతో అదే ఊపుతో మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌కు స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. సోలో నిర్మాత‌గా క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించి లాభాల కోస‌మే సినిమా చేస్తాడా? మ‌ళ్లీ పాత పంథాలోనే వ్య‌వ‌హ‌రిస్తాడా అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News