జాన్వీ కపూర్ స్థానం గూగుల్-ఏఐ కూడా దొరకలేదా?
ఎన్టీఆర్ ఇమేజ్ తో సోసోగా ఆడిన చిత్రం. మరి తంగ పాత్ర పరంగానైనా మార్క్ వేసిందా? అంటే అదీ లేదు. అమ్మడి పాత్రకు అందులో పెద్దగా స్కోప్ లేదు.;
బాలీవుడ్ లో జాన్వీ కపూర్ స్థానం ఎక్కడ? ర్యాకింగ్ లో అమ్మడు ఎన్నవ స్థానంలో ఉంది? అంటే గూగుల్ -ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో కూడా వెతుక్కోవాల్సిన పనిలేదు. జాన్వీ బాలీ వుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లు అవుతుంది. ఈ ఏడేళ్లలో జాన్వీ ఏం సాధించిందంటే? ఏం చెబుతాము? అన్నట్లే కనిపిస్తొంది సన్నివేశం. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ లో `దడక్` తో లాంచ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చేసిన సినిమాలు 13. వాటిలో రెండు సినిమాలు గెస్ట్ అపీరియన్స్ లు తీసేస్తే 11.
కలిసి రాని కాలం:
మరి వీటిలో ఎన్ని సినిమాలు విజయం సాధించాయంటే? చెప్పడం కష్టమే. `ధడక్` యావరేజ్ గా ఆడింది. గుంజన్ సక్సేనా బయోగ్రఫీలో నటించినా వర్కౌట్ అవ్వలేదు. ఓ మంచి ప్రయత్నం చేసిందనే ప్రశంస తప్ప ఆ సినిమా ద్వారా జాన్వీ సాధించింది ఏం లేదు. మిగతా సినిమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. అన్ని ఒకదానికొకటి పోటీ పడి మరీ ప్లాప్ రికార్డులు అందించిన చిత్రాలే. టాలీవుడ్ లో `దేవర`తో లాంచ్ అయింది. ఇక్కడైనా గ్రాండ్ విక్టరీ కొట్టిందంటే? అదీ లేదు. `దేవర` డివైడ్ టాక్ తోనే నడించింది.
జాన్వీ బ్రాండ్ ఎక్కడ?
ఎన్టీఆర్ ఇమేజ్ తో సోసోగా ఆడిన చిత్రం. మరి తంగ పాత్ర పరంగానైనా మార్క్ వేసిందా? అంటే అదీ లేదు. అమ్మడి పాత్రకు అందులో పెద్దగా స్కోప్ లేదు. పరిమితంగానే తెరపై కనిపించింది. ఓవరాల్ గా మొత్తం సినిమాలన్నింటి లో ఉత్తమ నటి అనే ప్రశంస ఏ సినిమాకైనా దక్కిందా? అంటే అదీ లేదు. కొంత మంది నటీమణులు నటించిన సినిమాలు పెయిలైనా పాత్రల పరంగా తమ ముద్ర వేస్తారు. జాన్వీ ఆవి షయంలో కూడా వెనుకబడే ఉంది.
`పెద్ది`పైనే ఆశలన్నీ:
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మామ్ ఇమేజ్ తో- డాడ్ ప్రోత్భబ లంతో అవకాశాలు అందుకోవడం తప్ప జాన్వీ సాధించిందేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన `పరమ్ సుందరి` కూడా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా పై జాన్వీ కూడా చాలా ఆశలే పెట్టుకుంది. కానీ అవన్నీ తప్పాయి. ఇక జాన్వీ చేతిలో ఉన్నది `పెద్ది` అనే పాన్ ఇండియా చిత్రం ఒక్కటే. ఈ సినిమాతోనైనా కపూర్ బ్యూటీ తన బ్రాండ్ వేస్తుందా? గూగూల్-ఏఐల్లో ర్యాంక్ ను రిజిస్టర్ చేస్తుందా? అన్నది చూడాలి.