విశ్వంభర టీం టైమింగ్ చూశారా?

ఐతే దీన్ని కేవలం త్రిష బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్‌గా చూడట్లేదు జనం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో టైమింగ్ చూసి ఈ పోస్టర్ వదిలింది టీం.;

Update: 2026-05-05 05:00 GMT

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘విశ్వంభర’ అప్‌డేట్ కోసం మెగా అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ టీం సౌండ్ చేయట్లేదు. గత ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావడానికి లైన్ క్లియర్ చేస్తూ తమ సినిమాను ఈ ఏడాది వేసవికి తీసుకురాబోతున్నట్లు టీం ప్రకటించింది. కానీ వేసవి వచ్చింది. కానీ సినిమా రిలీజ్ కావడం సంగతి అటుంచితే.. అసలు రిలీజ్ డేట్ ఎప్పుడన్నది కూడా చెప్పట్లేదు. జులై 10న రిలీజ్ అని సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయే తప్ప.. టీం మాత్రం అధికారికంగా విషయం చెప్పట్లేదు.

చిత్ర బృందం మరీ ఇంత సైలెంట్‌గా ఉండడం పట్ల అభిమానుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇలాంటి టైంలో సడెన్‌గా ఒక సర్ప్రైజ్ ఇచ్చింది ‘విశ్వంభర’ టీం. ఈ రోజు ‘విశ్వంభర’ నుంచి ఒక పోస్టర్ రిలీజైంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న త్రిష లుక్‌ను రిలీజ్ చేస్తూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన పోస్టర్ అది.

ఐతే దీన్ని కేవలం త్రిష బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్‌గా చూడట్లేదు జనం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో టైమింగ్ చూసి ఈ పోస్టర్ వదిలింది టీం. ఈ పోస్టర్లో త్రిష హారతి పళ్లెం పట్టుకుని ఎవరినో స్వాగతిస్తున్నట్లుగా ఉంది. సినిమాలో ఈ సన్నివేశం సందర్భం ఏమో కానీ.. ప్రస్తుతం తమిళనాట పరిస్థితులకు అయితే ఇది బాగా సూట్ అవుతోంది. భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన విజయ్.. త్రిషతోనే కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో గెలిచి ఇంటికి వస్తున్న విజయ్‌కి త్రిష హారతి ఇచ్చి స్వాగతిస్తున్నట్లుగా దీన్ని రిలేట్ చేసుకుంటున్నారు నెటిజన్లు.

టైమింగ్ చూసి భలే పోస్టర్ వదిలారు అంటూ ‘విశ్వంభర’ టీం మీద కామెంట్లు చేస్తున్నారు. ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకుని త్రిష తిరుమలకు వెళ్లగా.. విజయ్ కోసం పూజలు చేయడానికే ఆమె అక్కడికి వెళ్లిందంటూ చాలామంది వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. విజయ్ విజయం నేపథ్యంలో త్రిష ఆయన ఇంటికి కూడా చేరుకుంది. ఆమె పేరు ఉదయం నుంచి సోషల్ మీడియాలో మార్మోగిపోతుండగా.. విజయ్‌తో కలిసి ‘గోట్’ సినిమా కోసం ఆమె డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.


Tags:    

Similar News