ఆ డబ్బును మాలాంటి వాళ్లకు పంచండి సార్: విశ్వక్

ఏ హీరోకైనా గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో ఒక్క సినిమా అయినా చేయాలని స్ట్రాంగ్ కోరిక ఉంటుంది.

Update: 2026-06-11 10:42 GMT

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ పక్కా అని ఆడియన్స్ కి బాగా తెలుసు. రీసెంట్ గా 'దీవానా' మూవీ ప్రమోషన్స్ కోసం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా విశ్వక్ తనదైన స్టైల్ లో కామెంట్స్ చేశాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ కార్యక్రమంలో వీళ్లిద్దరి మధ్య జరిగిన ఒక ఫన్నీ కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఏ హీరోకైనా గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో ఒక్క సినిమా అయినా చేయాలని స్ట్రాంగ్ కోరిక ఉంటుంది. ఈ విషయాన్నే విశ్వక్ ఏ మాత్రం మొహమాటం లేకుండా అందరి ముందు ఓపెన్ గా అడిగేశాడు. తనకు ఆ సంస్థలో కచ్చితంగా సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఏంటి సార్ నేనంటే పగనా? అంటూ.. ఆఫర్ కోసం తన మొదటి సినిమా టైమ్ లో లాగా మళ్లీ ఆడిషన్ ఇవ్వడానికైనా తను పూర్తిగా రెడీ అని చెప్పి అందరినీ నవ్వించాడు.

విశ్వక్ రిక్వెస్ట్ కు అల్లు అరవింద్ కూడా అంతే స్పోర్టివ్ గా రియాక్ట్ అయ్యారు. ఆడిషన్స్ లాంటివి ఏం అవసరం లేదు కానీ, ఈ మధ్య కాలంలో నువ్వు రెమ్యునరేషన్ బాగా పెంచేశావని, డబ్బులు కాస్త ఎక్కువ అడుగుతున్నావని అరవింద్ డైరెక్ట్ గా ఒక పంచ్ వేశారు. స్టేజ్ కింద కూర్చున్న ఒక సీనియర్ ప్రొడ్యూసర్ అలా సడెన్ గా మైక్ తీసుకుని కౌంటర్ వేయడంతో ఆడిటోరియంలో ఉన్న వాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు.

అరవింద్ కౌంటర్ కు విశ్వక్ అస్సలు తగ్గకుండా తనదైన స్టైల్ లో భలే రిప్లై ఇచ్చాడు. మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా సార్, అసలు మీకు దేనికి తక్కువ అని వెంటనే తిరిగి సరదాగా ప్రశ్నించాడు. ఇక్కడ ఈ థియేటర్ మీదే, ఇప్పుడు మీరు కూర్చున్న ఆ సీటు కూడా మీదే అని చెబుతూ అల్లు అరవింద్ రేంజ్ ఏంటో ఫన్నీగా వివరించే ప్రయత్నం చేశాడు. విశ్వక్ మాటలకు అల్లు అరవింద్ కూడా పగలబడి నవ్వారు.

అక్కడితో ఆపకుండా విశ్వక్ ఆన్ ద స్పాట్ మరో డైలాగ్ పేల్చాడు. మీ దగ్గర ఉన్న ఆ డబ్బును మాలాంటి చిన్న వాళ్లకు కూడా కాస్త పంచండి సార్ అని అడిగాడు. అలా మాలాంటి వాళ్లకు డబ్బులు పంచితేనే కదా మన ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది అని విశ్వక్ లాజిక్ లాగడంతో అక్కడ ఫుల్ ఫన్ క్రియేట్ అయింది. ఒక బడా నిర్మాతతో ఇంత క్యాజువల్ గా మాట్లాడటం బహుశా విశ్వక్ కే సాధ్యం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి సరదా చిట్ చాట్స్ సినిమా ప్రమోషన్స్ కు ఎంతగానో హెల్ప్ అవుతాయి. దీవానా లాంటి యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న సినిమాలకు ఇలాంటి పాజిటివ్ బజ్ చాలా అవసరం. ఒక సీనియర్ ప్రొడ్యూసర్, ఒక యాక్టివ్ యంగ్ హీరో మధ్య జరిగిన ఈ కన్వర్జేషన్ మూవీ యూనిట్ కు ఫ్రీగా పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఎలాంటి పట్టింపులు లేకుండా అల్లు అరవింద్ ఇలాంటి యంగ్ జనరేషన్ హీరోలతో కలిసిపోయి ఎంజాయ్ చేయడం ఇండస్ట్రీలో ఆయన ఎంత స్నేహంగా ఉంటారో చెప్పవచ్చు.

Tags:    

Similar News