ట్రెండీ స్టోరి: పే చెక్కుల కోసం ప‌డిపోరు మ‌న గ్రేట్ స్టార్లు!

భారతదేశంలోని ఒక ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారుడు తనకు వచ్చిన కోట్లాది రూపాయల పే-చెక్ ఆఫర్‌ను నిర్మొహమాటంగా కాదనుకున్నాడనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-06-11 10:30 GMT

కమర్షియల్ ప్రకటనల ద్వారా వచ్చే భారీ పే-చెక్కుల కోసం కాకుండా.. సమాజం విష‌యంలో తమకున్న బాధ్యతను గుర్తుంచుకుని వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉండే నటులుగా సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి దిగ్గజాలు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఈ అగ్ర కథానాయకుల క్రేజ్ -ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాయి. థంబ్స్ అప్, కోకాకోలా వంటి ప్రముఖ బేవరేజెస్ కంపెనీలు కోట్లాది రూపాయల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినా.. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను తాము ప్రమోట్ చేయబోమంటూ రజనీకాంత్, పవన్ కల్యాణ్ వంటి స్టార్లు ఆ ఆఫర్లను తృణప్రాయంగా వదిలేసుకుని తమ నైతికతను చాటుకున్నారని క‌థ‌నాలొచ్చాయి.

ఇప్పుడు సరిగ్గా అదే బాటలో పయనిస్తూ భారతదేశంలోని ఒక ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారుడు తనకు వచ్చిన కోట్లాది రూపాయల పే-చెక్ ఆఫర్‌ను నిర్మొహమాటంగా కాదనుకున్నాడనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ క్రీడాకారుడు మరెవరో కాదు.. భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ చిత్రం ప్రమోషన్ల కోసం ఖాన్‌ల‌తో పాటు విరాట్ ని కూడా సంప్ర‌దించార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో భాగంగానే విరాట్ కోహ్లీని కూడా సదరు బృందం సంప్రదించింది. తమ చిత్ర ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడానికి కోహ్లీకి ఏకంగా రూ. 2.5 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారంటూ నెట్టింట ఒక వార్త జోరుగా ప్రచారమవుతోంది. అయితే కేవలం డబ్బు కోసం తనను నమ్మే కోట్లాది మంది అభిమానులను పక్కదోవ పట్టించడం ఇష్టం లేక విరాట్ కోహ్లీ ఈ భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. డబ్బు కంటే విలువలే ముఖ్యమని కోహ్లీ నిరూపించిన తీరు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

వాస్తవానికి విరాట్ కోహ్లీకి ప్రకటనలు లేదా ప్రమోషన్ల విషయంలో కొన్ని కచ్చితమైన వ్యక్తిగత సూత్రాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువును లేదా సినిమాను తాను స్వయంగా చూసి, అనుభవించి.. అది నిజంగా బాగుందని నమ్మితేనే తప్ప దానికి మద్దతు ఇవ్వకూడదనేది ఆయన సిద్ధాంతం. ఒకవేళ భవిష్యత్తులో ఈ చిత్రం `ధురంధర్` వంటి అత్యుత్తమ స్థాయి ప్రమాణాలతో ఉంటే ఆయనే స్వయంగా అభినందిస్తారని అంతేకానీ కేవలం ఒక చెక్ కోసం గుడ్డిగా దేనినీ ప్రశంసించరని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో `మేము సరైన వ్యక్తినే ఆరాధిస్తున్నాము!` అంటూ నెటిజన్లు కోహ్లీ నిజాయితీని, నైతిక విలువలను ఆకాశానికెత్తుతున్నారు.

భారీ బడ్జెట్ చిత్రాల ప్రమోషన్ల కోసం ఇలాంటి పెయిడ్ క్యాంపెయిన్లు చేయడం సినీ పరిశ్రమలో సర్వసాధారణం అయినా.. విరాట్ కోహ్లీ లాంటి అంతర్జాతీయ స్టార్ దానికి దూరంగా ఉండటం విశేషం. అయితే విరాట్ కోహ్లీ మాత్రమే కాకుండా సచిన్ టెండూల్కర్, పుల్లెల గోపీచంద్ వంటి పలువురు క్రీడాకారులు కూడా గతంలో మోరాలిటీస్ కోసం హానికరమైన పొగాకు, మద్యం, సాఫ్ట్ డ్రింక్స్ ప్రకటనలలో నటించకుండా కోట్లు వదులుకున్నారు. ప్రజలకు హాని చేయవని.. సమాజానికి మేలు జరుగుతుందని తెలిస్తే తప్ప కేవలం డబ్బు కోసం చెత్త వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి నేటి తరం స్టార్లు, క్రీడాకారులు వెనకాడుతున్నారనేది నిజం. ఈ ప్ర‌చారంపై ఇప్ప‌టివ‌ర‌కూ సదరు సంస్థ అధికారికంగా స్పందించ‌లేదు.

Tags:    

Similar News