18 ఏళ్ల వయసులో పూజా హెగ్డే ఎలా ఉందో చూశారా.. వీడియో వైరల్

తెలుగులో 'ఒక లైలా కోసం', 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో టాలీవుడ్ బుట్టబొమ్మగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Update: 2026-08-03 07:43 GMT

టాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా, స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే ప్రయాణం ఎందరికో స్పూర్తిదాయకం. 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఈ పూజా హెగ్డే.. 18 ఏళ్ల వయసులో ఎలా ఉందో ఎప్పుడైనా చూశారా? మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న సమయంలో ఆమె మాట్లాడిన ఒక త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..

మిస్ ఇండియా స్టేజ్‌పై 18 ఏళ్ల పూజ:

2009లో జరిగిన 'ఫెమినా మిస్ ఇండియా' పోటీల్లో పూజా హెగ్డే 18 ఏళ్ల వయసులో తొలిసారి మోడల్‌గా ర్యాంప్ వాక్ చేశారు. ముంబైకి ప్రాతినిధ్యం వహించిన ఆమె, తన డ్రీమ్స్ గురించి చెబుతూ స్టేజిపై మాట్లాడిన పరిచయ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో బక్కపలుచగా, ఎంతో అమాయకంగా కనిపిస్తున్న పూజను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అప్పటికి, ఇప్పటికి ఆమె లుక్‌లో వచ్చిన మార్పు చూసి అసలు గుర్తుపట్టలేకపోతున్నారు.

మోడలింగ్ నుంచి వెండితెర ప్రయాణం:

మిస్ ఇండియా పోటీల్లో 'ఫెమినా మిస్ టాలెంటెడ్' టైటిల్ గెలుచుకున్న పూజ, ఆ తర్వాత 2010 మిస్ ఇండియా యూనివర్స్ పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఇక ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్ల దారినే ఎంచుకుని 2012లో తమిళ చిత్రం ‘ముగమూడి’తో సినీ రంగప్రవేశం చేశారు. ఇక మొదట్లో కొన్ని ప్లాప్‌లు పడినా, తన పట్టుదలతో పాన్-ఇండియా రేంజ్‌కు ఎదిగారు. ఇక మొన్న వచ్చిన 'జననాయగన్ లో అవకాశం దక్కించుకోవడం ఆమె సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలిచిపోనుంది.

టాలీవుడ్‌లో స్టార్‌డమ్ , విజయాలు:

తెలుగులో 'ఒక లైలా కోసం', 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో టాలీవుడ్ బుట్టబొమ్మగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. వరుస విజయాలతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. నటిగా ఎన్నో అవార్డులు అందుకోవడమే కాకుండా, 'ఆల్ ఎబౌట్ లవ్' అనే ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు సేవ చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు.

కష్టానికి దక్కిన ఫలితం:

నాడు మిస్ ఇండియా స్టేజ్ మీద ర్యాంప్‌పై సరిగ్గా నడవడానికి ఇబ్బంది పడిన 18 ఏళ్ల అమ్మాయి.. నేడు భారతీయ చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా నిలవడం వెనుక ఎంతో కష్టం ఉంది. అప్పటి ఆమె లుక్ చూసి "కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు" అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..



Tags:    

Similar News