స్టైలిష్ స్టెప్పులతో మృణాల్ ఠాకూర్.. ప్రైవేట్ పార్టీ వీడియో వైరల్!

తెలుగు ప్రేక్షకులకు సీతగా దగ్గరై, అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మృణాల్ ఠాకూర్.

Update: 2026-08-03 07:53 GMT

తెలుగు ప్రేక్షకులకు సీతగా దగ్గరై, అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మృణాల్ ఠాకూర్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీకి సంబంధించిన ఏ ఫోటో లేదా వీడియో అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా తన సన్నిహితుల ప్రవేట్ పార్టీ లో మృణాల్ చేసిన మాస్ అండ్ ఎనర్జిటిక్ డాన్స్ వీడియో ఒకటి నెట్టింట తీవ్రంగా హల్‌చల్ చేస్తూ, ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది..ఆ విశేషాలు చూద్దాం

బారాత్‌లో మెజెంటా శారీలో కనువిందు:

ఒక ప్రైవేట్ వెడ్డింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్, తన ఫ్రెండ్ పెళ్లి బారాత్‌లో ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ కనిపించారు. మెజెంటా కలర్ శారీ, ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ ధరించి అత్యంత సంప్రదాయబద్ధంగా, రాయల్ లుక్‌లో కనిపిస్తూనే.. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సరదాగా స్టెప్పులేశారు. ఆమె ఊరమాస్ అండ్ స్టైలిష్ మూవ్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్:

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికలుగా ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. "ఎంత స్టార్డమ్ ఉన్నా ఫ్రెండ్స్ పెళ్లి పార్టీ లో ఎంత డౌన్-టు-ఎర్త్‌గా సందడి చేస్తోందో" అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక స్క్రీన్‌పై మాత్రమే కాదు.. రియల్ లైఫ్‌లోనూ మృణాల్ ఎంతో సరదాగా ఉంటుందనడానికి ఈ ప్రైవేట్ పార్టీ వీడియోనే నిదర్శనమని పొగిడేస్తున్నారు.

టాలీవుడ్‌లో క్రేజ్.. కెరీర్‌లో ఆసక్తికర పరిస్థితి:

'సీతారామం', 'హాయ్ నాన్న' వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మృణాల్, రీసెంట్ గా 'డెకాయిట్' మూవీతో ఆకట్టుకున్నారు. అయితే ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్ట్‌లు త్వరగా ఓకే కాకపోవడంపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఇక బాలీవుడ్‌లో చేసిన కొన్ని సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఆమె తదుపరి సినిమాలపై ఉత్కంఠ నెలకొంది.

అల్లు అర్జున్ ‘రాకా’ పైనే ఆశలు:

ప్రస్తుతం మృణాల్ చేతిలో ఉన్న మోస్ట్ అవైటెడ్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ మాత్రమే. ఈ సినిమాలో మృణాల్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పాన్-ఇండియా చిత్రం సక్సెస్ అయితే ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందని భావిస్తున్నారు.

కెరీర్ లో బ్రేక్ వచ్చినా తగ్గని క్రేజ్:

సినిమా అవకాశాల మాట ఎలా ఉన్నా మృణాల్ ఠాకూర్ పాపులారిటీ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇక ఈ డాన్స్ వీడియోతో మరోసారి నెటిజన్ల దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ సీత, 'రాకా' సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో వేచి చూడాలి..



Tags:    

Similar News