ఒక యాక్టర్ ఏదైనా చేయగలగాలి.. వరుణ్ తేజ్ కొత్త ఫిలాసఫీ!

ఈ నేపథ్యంలో ఆగస్ట్ 7న రిలీజ్ కానున్న కొరియన్ కనకరాజు వరుణ్ కెరీర్‌లో కీలక చిత్రంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Update: 2026-08-03 07:38 GMT

టాలీవుడ్‌లో కమర్షియల్ ఇమేజ్‌ను కాపాడుకోవడమే చాలా మంది హీరోల ప్రాధాన్యంగా భావించే సమయంలో, వరుణ్ తేజ్ మాత్రం తన కెరీర్‌ను మరో యాంగిల్ లో చూస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతి సినిమాను రిస్క్‌గా భావించి ప్లాన్ చేయనని, తనకు నచ్చిన క్యారెక్టర్‌ను మాత్రమే ఎంచుకుంటానని ఆయన చెప్పిన మాటల్లో ఒక నటుడిగా తన ఆలోచనా విధానం స్పష్టంగా కనిపిస్తుంది. కెరీర్ ప్లానింగ్ కంటే క్యారెక్టర్ సెలెక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తానని చెప్పడం, ఆయన ఫోక‌స్ మార్కెట్ పైన కంటే యాక్టింగ్ పైనే ఉందనే సంకేతాన్ని ఇస్తోంది.

ఒక యాక్ట‌ర్ ఒకే తరహా పాత్రల్లో కనిపించడం కంటే, వైవిధ్యమైన పాత్రల ద్వారా తన పరిధిని విస్తరించుకోవాలన్న ఆలోచన వ‌రుణ్ మూవీస్ సెలెక్ష‌న్ లో కనిపిస్తోంది. వేరియేషన్ కోసం స్పెష‌ల్ గా ట్రై చేయ‌న‌ని, తాను ఎంచుకున్న పాత్రల వల్లే ఆ వైవిధ్యం వస్తుందని చెప్పడం కూడా అదే దృక్పథాన్ని బలపరుస్తోంది. ఒక యాక్ట‌ర్ ఏదైనా చేయ‌గ‌ల‌ను అనే దానిపైనే ఫోక‌స్ పెట్టాల‌ని, తాను అదే చేస్తాన‌ని వ‌రుణ్ అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆగస్ట్ 7న రిలీజ్ కానున్న కొరియన్ కనకరాజు వరుణ్ కెరీర్‌లో కీలక చిత్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. వరుస ఫ్లాపుల తర్వాత ఆయనకు ఒక స్ట్రాంగ్ స‌క్సెస్ తో పాటు, నటుడిగా తనపై ఉన్న అంచనాలను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా హిట్ అయితే వరుణ్ తేజ్ కెరీర్‌లో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

ముఖ్యంగా టైర్2 హీరోల మార్కెట్‌లో ప్రస్తుతం కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ టైమ్ లో కొరియన్ కనకరాజు హిట్ అయితే, వరుణ్‌ను కేవలం కమర్షియల్ హీరోగా కాకుండా, విభిన్న పాత్రలు చేయగల నటుడిగా డౌరెక్ట‌ర్లు మరింత సీరియస్‌గా చూసే అవ‌కాశ‌ముంది. కొత్త తరహా కథలు, ప్రయోగాత్మక స్క్రిప్ట్‌లు, జానర్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఆయన ఫస్ట్ ఛాయిస్ గా మారే అవకాశం ఉంటుంది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తి పెరిగింది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంటే, వరుణ్ తేజ్ కెరీర్‌కు ఇది కేవలం ఒక హిట్ మాత్రమే కాకుండా, యాక్ట‌ర్ గా వ‌రుణ్ ఎంచుకున్న రూట్ కు మంచి గుర్తింపుగా కూడా నిలుస్తుంది. ఇమేజ్ కంటే పాత్రలను నమ్మే హీరోగా వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని ఈ సినిమా ఎంతవరకు అందిపుచ్చుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News