ప్రేమ.. అనుకువ.. శ్రద్ధ.. గత 5 రోజుల పోరాటం..!
విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా నవంబర్ 14న రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.;
విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా నవంబర్ 14న రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని నవ్విస్తూ అలరిస్తున్న ఈ సినిమా సక్సెస్ మీట్ ని మేకర్స్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత మధురా శ్రీధర్ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. సినిమా సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్ చెప్పిన ఆయన సినిమా రిలీజ్ అవ్వగానే చాలా మంచి అప్రిసియేషన్స్ వచ్చిందని అన్నారు.
మాకున్న స్టార్ కాస్ట్ తో ప్రజలకు రీచ్ అవ్వాలని..
ఐతే సినిమాకు జి.ఎస్.కె మీడియా, హౌస్ ఫుల్ మీడియా ప్రమోషన్స్ బాగా సపోర్ట్ చేశారు. చిన్న సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని భయాలు ఉంటాయి రిలీజైన దగ్గర నుంచి సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి అని పోరాడుతూ వచ్చారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రతి చోట ప్రమోట్ చేశారని అన్నారు మధురా శ్రీధర్. మాకున్న స్టార్ కాస్ట్ తో ప్రజలకు రీచ్ అవ్వాలని సాధనాల్లా ప్రతి నిమిషం పనిచేశామని అన్నారు. ఈ సినిమా సక్సెస్ తో మళ్లీ కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి బలం ఇచ్చారని అన్నారు మధురా శ్రీధర్.
ఈరోజు మమ్మల్ని అభినందించడానికి వచ్చిన లగడపాటి శ్రీధర్ గారికి థాంక్స్. నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మా సినిమా మరో నిర్మాత నా పార్ట్ నర్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి కూడా బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు ఆయన అన్ కండీషనల్ సపోర్ట్ అందించారని మధురా శ్రీధర్ అన్నారు.
ప్రేమ.. అనుకువ.. శ్రద్ధ..
విక్రాంత్, చాందిని కూడా సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన నెగిటి రివ్యూస్ ని పట్టించుకోకుండా వాళ్లు మంచి రివ్యూస్ తీసుకుని ఉత్సాహంగా పోరాడారు. లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి ఐతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇది కదా మనకు కావాల్సింది అనిపించింది.. విక్రాంత్, చాందిని ఇద్దరికీ థాంక్స్ చెప్పారు మధురా శ్రీధర్. ఇక ఫైనల్ గా మురళీధర్ గారు ఫస్ట్ డే సినిమాకు మీరు పర్ఫెక్ట్ ఊఅప్ట్ అని ఎలా అనుకున్నామో ఈరోజు అందరు మిమ్మల్ని పొగుడుతున్నారని చెప్పారు మధురా శ్రీధర్.
ఇక ఇదే సక్సెస్ మీట్ లో హీరో విక్రాంత్ కూడా ప్రేమ అనుకువ శ్రద్ధ ఈ మూడు ఉండటం వల్ల సంతాన ప్రాప్తిరస్తు ప్రేక్షకులను మెప్పిస్తుందని అన్నారు. డైరెక్టర్ ప్రేమతో ఈ సినిమా తీశారు.. సినిమాలో ప్రతి సీన్ లో ప్రేమ కనిపిస్తుంది. అనుకున్వ.. సినిమా ఎక్కడ డ్రమటైజ్ కాకుండా చాలా బాగా తీశారు. ఒక మంచి మీల్ తిన్నట్టు తీశారు. ఇక శ్రద్ధ.. ఈ సినిమాలో ప్రతి సీన్, డైలాగ్ ఎంతో శ్రద్ధగా చేశారు. అందుకే ఆడియన్స్ నుంచి ఈ రెస్పాన్స్ వస్తుంది.
చిన్న సినిమాలను ఆడియన్స్ ఆదరించాలి.. సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కేవలం పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు మా లాంటి హీరోలు కూడా ఆదరించాలని విక్రాంత్ చెప్పారు. ఈ సినిమా ముగ్గురు బ్రదర్స్ ను ఇచ్చింది.. సినిమాకు చాందిని చౌదరి చాలా సపోర్ట్ చేసిందని అన్నారు విక్రాంత్.