• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళితో సినిమా నిజమే,...

రాజమౌళితో సినిమా నిజమే, కానీ..!

| తమిళ్‌ హీరో విక్రమ్‌ ఇప్పటి వరకు ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించాడు.

By - Tupaki Desk
Update: 2024-08-29 07:34 GMT

తమిళ్‌ హీరో విక్రమ్‌ ఇప్పటి వరకు ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించాడు. ఆయన కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తాజాగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పా రంజిత్ సినిమాలు వైవిధ్యభరితంగా, మట్టి వాసన తో ఉంటాయి. తంగలాన్ కూడా అదే తరహాలో ఉండటంతో పాటు, విక్రమ్‌ మార్క్ కూడా జత చేసుకుని మంచి సినిమాగా నిలిచింది. తంగలాన్ సినిమా కు సౌత్ లో మంచి స్పందన వచ్చింది. తమిళ్‌ తో పాటు తెలుగు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆధరించారు.


ఇప్పుడు తంగలాన్ సినిమాను హిందీలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సౌత్‌ లోని అన్ని రాష్ట్రాల్లో తిరిగి ప్రమోషన్‌ చేసిన విక్రమ్‌ ఇప్పుడు తంగలాన్‌ ను ఉత్తర భారతంలో ప్రమోట్‌ చేస్తున్నారు. జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడుతూ, ఇంగ్లీష్ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తంగలాన్ హిందీ వర్షన్‌ ను ప్రమోట్‌ చేస్తున్నాడు. తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

విక్రమ్‌ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నా నుంచి వచ్చే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అందుకే నేను తంగలాన్ వంటి సినిమాలు చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేస్తే నా ఫ్యాన్స్, ప్రేక్షకులు వాటిని తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి. అందుకే వారు కోరుకునే విధంగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో కథలు, పాత్రలను ఎంపిక చేసుకుంటాను. అపరిచితుడు, పొన్నియన్ సెల్వన్‌ లో చేసినటువంటి పాత్రలను మళ్లీ మళ్లీ చేయాలనే ఉద్దేశ్యంతో విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటాను. ముందు ముందు కూడా నా నుంచి మరిన్ని విభిన్న పాత్రలతో సినిమాలు వస్తాయి.

పొన్నియన్ సెల్వన్‌ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు రావడం సంతోషంగా ఉంది. అయితే నాకు కూడా అవార్డ్‌ వచ్చి ఉంటే మరింత సంతోషంగా ఉండేది అన్నాడు. ఇక రాజమౌళి తో సినిమా గురించి విక్రమ్‌ స్పందిస్తూ... గతంలో రాజమౌళి సర్‌ తో సినిమాకు సంబంధించిన చర్చలు జరిగిన విషయం నిజమే. కానీ ఇప్పట్లో మా కాంబోలో సినిమా ఉండదు. భవిష్యత్తులో తప్పకుండా ఆయన దర్శకత్వంలో నటిస్తాను అంటూ విక్రమ్‌ చెప్పుకొచ్చాడు. హిందీ ప్రేక్షకులు కూడా తంగలాన్ ను ఆధరించే విధంగా దర్శకుడు పా రంజిత్ రూపొందించాడని, తప్పకుండా ఉత్తర భారతంలో కూడా మా సినిమా హిట్‌ అవుతుందనే విశ్వాసంను విక్రమ్‌ వ్యక్తం చేశాడు.

Tags:    
  • Kollywood 
  • Filminudstry 
  • Vikram 
  • Thangalaan 
  • Bollywood 
  • Rajamouli 
  • RRR 
  • SSMB29 
  • Promotions 
  • Mumbai 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS