• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరో చెబుతున్న...

స్టార్ హీరో చెబుతున్న అడ్జెస్ట్మెంట్ పాఠం..!

| ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా సరే ఒకప్పటి పరిస్థితి పెరిగిన వాతావరణం మర్చిపోకూడదు.

By - Tupaki Desk
Update: 2024-03-26 05:08 GMT

ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా సరే ఒకప్పటి పరిస్థితి పెరిగిన వాతావరణం మర్చిపోకూడదు. ఎందుకంటే కాస్త డబ్బులు కనపడగానే లేని పోని హంగు ఆర్భాటాలకు పోవడం మానవ నైజం. కానీ అలాంటి టైం లోనే మన గతాన్ని గుర్తు చేసుకోవాలి. అంతేకాదు ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా సరే జీవితంలో అడ్జెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అడ్జెస్ట్ అవుతూనే జీవితంలో ముందుకు వెళ్లగలం. ఇదే విషయాన్ని లేటెస్ట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ఈమధ్యనే ఒక కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ లైఫ్ లో అడ్జెస్ట్మెంట్ అనేది కంపల్సరీ అంటున్నాడు.


ఇప్పుడు తానొక మంచి పొజిషన్ ఉన్నా కూడా జీవితంలో ఎన్నో పరిస్థితులకు అడ్జెస్ట్ అవుతూ వచ్చానని విజయ్ దేవరకొండ అన్నారు. స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు నాన్నను సైకిల్ అడిగితే.. బర్త్ డేకి కొనిస్తానని అన్నారు. బర్త్ డే కాస్త హాలీడేస్, ఫెస్టివల్ ఇలా వాయిదా వేస్తూ వచ్చారు. సైకిల్ మాత్రమే కాదు టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్ ఇలా ప్రతి ఒక్కటి అడ్జెస్ట్ అవుతూనే వచ్చాను. చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అడ్జెస్ట్ అవుతూ వస్తుంటాం. అడ్జెస్ట్మెంట్ అనేది జీవితంలో ఒక పాఠం అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ స్టార్ అంటే ఫ్యామిలీని నిలబెట్టే స్టార్ అని.. ఫ్యామిలీ అంతా కూడా చూసి ఎంజాయ్ చేసే సినిమాగా ఫ్యామిలీ స్టార్ వస్తున్నాడని చెబుతున్నారు. ఆల్రెడీ పరశురాం తో గీతా గోవిందం లాంటి హిట్ కొట్టిన సెంటిమెంట్ ఉంది కాబట్టి ఫ్యామిలీ స్టార్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

విజయ్ దేవరకొండ ఖుషి సినిమా జస్ట్ ఓకే అనిపించుకోగా ఫ్యామిలీ స్టార్ తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. సర్కారు వారి పాట తర్వాత పరశురాం చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే బజ్ బాగుంది. సినిమా ఫ్యామిలీస్ ని టచ్ చేస్తే చాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నట్టే లెక్క. ఏప్రిల్ 5న సోలోగా వస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.

Tags:    
  • Vijaydevarakonda 
  • Familystar 
  • Mrunalthakur 
  • Parusuram 
  • Life 
  • Tollywood 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS