విజయ పాల ప్యాకెట్ పై వీరమల్లు పోస్టర్.. క్లారిటీ ఇచ్చిన డెయిరీ ఎండీ

ఇదంతా వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగమేనని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఇవన్నీ ఒకెత్తైతే విజయ మిల్క్ ప్యాకెట్ పై సినిమా పోస్టర్ ఉండడం కాస్త కాంట్రవర్సీ అయ్యింది.;

Update: 2025-07-19 07:31 GMT

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24 న విడుదల కానుంది. పవర్ స్టార్ సినిమా దాదాపు మూడేళ్ల తర్వాత థియేటర్లలోకి రానుండడంతో ఫ్యాన్స్ దీన్ని ఓ పండగలా జరుపుకుంటున్నారు. సినిమాకు భారీ ఓపెనింగ్ ఇచ్చేందుకు సిద్ధమైపోయారు.

ఏ సినిమానైనా రిలీజ్ కు ముందు ప్రేక్షకులను రీచ్ అవ్వాలంటే మేకర్స్ గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తారు. ఇందులో భాగంగానే పాటలు, ఇంటర్వ్యూలు, మీడియా చిట్ చాట్ లో పాల్గొంటారు. అలాగే ఆఫ్ లైన్ లో కూడా ప్రమోషన్స్ చేస్తారు. ఈ క్రమంలోనే ప్రముఖ డెయిరీ విజయ పాల ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్, వాటర్ బాటిల్స్ పై హరిహర వీరమల్లు సినిమా పోస్టర్ తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఇదంతా వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగమేనని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఇవన్నీ ఒకెత్తైతే విజయ మిల్క్ ప్యాకెట్ పై సినిమా పోస్టర్ ఉండడం కాస్త కాంట్రవర్సీ అయ్యింది. దీనిపై తాజాగా విజయ పాల డెయిరీ ఎండీ ఈశ్వర్ బాబు స్పందించారు. అదంతా ఫేక్ అని కొట్టిపారేశారు. టెక్నాలజీ యూజ్ చేసి ఎవరో అలా సినిమా పోస్టర్ డిజైన్ చేశారని అన్నారు. ఎప్పటికీ తమ సంస్థ ఇలాంటి ప్రచారాలను ప్రొత్సహించదని విజయ డెయిరీ ఎండీ క్లారిటీ ఇచ్చారు.

అయితే విజయ మిల్క్‌ కు 60 ఏళ్ల చరిత్ర ఉంది. విజయవాడ కేంద్రంగా ఈ డెయిరీ ఉత్పత్తులు సాగుతాయి. తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణ భారత్‌ లోనూ విజయ డెయిరీకి మంచి సంస్థగా గుర్తింపు ఉంది. రోజుకు లక్షల లీటర్ల పాలు, పెరుగు ఉత్పత్తులను ఈ డెయిరీ అందిస్తుంది.

ఇక సినిమా విషయానికొస్తే, దీన్ని క్రిష్ జాగర్లమూడి ప్రారంభించగా, మధ్యలో దర్శకుడు జ్యోతికృష్ణ టేకాఫ్ చేశారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా, స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో తొలి పార్ట్ రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం సినిమాను నిర్మించారు.

Tags:    

Similar News