మళ్లీ అతడు విలన్ గానా?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రాలు..ఇతర స్టార్స్ తో కలిసి నటించిన పాత్రల గురించి చెప్పాల్సిన పనిలేదు.;
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రాలు..ఇతర స్టార్స్ తో కలిసి నటించిన పాత్రల గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరో అయినా? విలన్ అయినా? ఎలాంటి పాత్ర అయినా? సేతుపతి రంగంలోకి దిగనంత వరకే. ఒన్స్ ఆయన ఎంటర్ అయ్యాడంటే? అది ఎలాంటి రోల్ అయినా పండాల్సిందే. ఈ క్రమంలో విజయ్ సేతు పతి చాలా కాలం పాటు, సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే నెగిటివ్ పాత్రలు..విలన్ రోల్స్ చేయడం వల్ల హీరోగా అవకాశాలు తగ్గుతున్నాయనే భావన కలిగింది.
దీంతో కొంత కాలం పాటు, నెగిటివ్ రోల్స్ చేయని ఒట్టు పెట్టుకున్నాడు. అయినా సరే కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు రావడంతో నో చెప్పలేక చేసాడు. అలా చేసిన చిత్రమే విక్రమ్. ఆ తర్వాత మళ్లీ ఆ తరహా పాత్రల్లో పెద్దగా కనిపించలేదు. అప్పటి నుంచి హీరోగానే పని చేస్తున్నాడు. అయితే తాజాగా విజయ్ సేతుపతి మళ్లీ విలన్ అవతారం ఎత్తడానికి రెడీ అవుతున్నారు. శింబు కథానాయకుడిగా వెట్రీమారన్ దర్శకత్వంలో `అరసన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఇందులో ఓ నెగిటివ్ పాత్రలో శింబు నటిస్తున్నట్లు నిర్మాత కలైపులి ఎస్ థాను ప్రకటించారు. `అరసన్` ప్రపం చంలోకి స్వాగతమంటూ సేతుపతిని స్వాగతించారు. ఇదే సినిమా తెలుగు లో `సామ్రాజ్యం` టైటిల్ తో అనువాదమ వుతుంది. మరి విలన్ పాత్రలకు బై బై చెప్పేసిన సేతుపతి మళ్లీ బ్యాక్ కి వెళ్లడానికి కారణం ఏంటి? అంటే దర్శకుడు వెట్రీమారన్ కారణం అయి ఉండొచ్చు. కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో వెట్రీ మారన్ టాప్ లో కొనసాగుతున్నారు.
ఆయన సినిమాలు ఎంత వాస్తవికంగా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. కమర్శియాల్టీకి దూరంగా రూపొందించే గ్రేట్ ఫిల్మ్ మేకర్. అయినా మారన్ సినిమాలంటే వాణిజ్య పరంగా మంచి వసూళ్లు రాబడుతుంటాయి. అలాగే వెట్రీమారన్ తో విజయ్ కు మంచి ర్యాపో ఉంది. ఇద్దరి కాంబినేషన్ లో కొన్ని సినిమాలు కూడా తెరకెక్కాయి. ఈ నేపథ్యంలో విలన్ పాత్రకు వెట్రీమారన్ అడగడంతో విజయ్ నో చెప్పలేకపోయినట్లు కనిపిస్తోంది.