సేతుపతిని కన్విన్స్ చేయలేకపోయాడు..!
మొన్నటిదాకా విలన్ రోల్స్ లాంటివి కూడా చేసిన విజయ్ సేతుపతి ఇక మీదట అలాంటి రోల్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు.;
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సినిమాల సెలక్షన్ లో డిఫరెంట్ గా ఉంటాడు. మొన్నటిదాకా విలన్ రోల్స్ లాంటివి కూడా చేసిన విజయ్ సేతుపతి ఇక మీదట అలాంటి రోల్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. అందుకే సోలో సినిమాలు చేస్తూ సత్తా చాతుతున్నాడు. ఈమధ్య కోలీవుడ్ లో విజయ్ సేతుపతి చేస్తున్న సినిమాలు మంచి సక్సెస్ లు సాధిస్తున్నాయి. రీసెంట్ గా తలైవన్ తలైవి సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు.
విజయ్ సేతుపతి శేషారాయణం..
ఐతే ఈ సినిమాతో పాటు అసలైతే తెలుగులో వస్తున్న ఒక పాన్ ఇండియా సినిమాలో కూడా విజయ్ సేతుపతి నటించాల్సింది. అది కూడా ఆల్రెడీ ఒక డైరెక్టర్ తో సినిమా చేసినా కూడా మరో ఛాన్స్ ఇస్తానంటే వద్దన్నాడట. అలా ఎందుకు జరిగింది అంటే.. బుచ్చి బాబు డైరెక్షన్లో ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి శేషారాయణం పాత్రలో అదరగొట్టాడు. బుచ్చి బాబు నెక్స్ట్ సినిమా పెద్దిలో కూడా విజయ్ సేతుపతి కోసం ఒక రోల్ రాసుకున్నాడు.
ఎందుకో కానీ విజయ్ సేతుపతి ఆ రోల్ ని చేయనని చెప్పాడు. విజయ్ సేతుపతి ఇక మీదట కేవలం సోలో సినిమాలు చేయాలనే నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాడట. అందుకే పెద్దిలో ఒక పవర్ ఫుల్ రోల్ కాదనేశాడట. ఐతే విజయ్ సేతుపతి కాదన్న ఆ రోల్ నే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో చేయిస్తున్నారు. శివరాజ్ కుమార్ కూడా తెలుగులో ఒక మంచి మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్జీవితో కిల్లింగ్ వీరప్పన్ సినిమా చేశాడు. ఐతే ఆ తర్వాత శివ రాజ్ కుమార్ తెలుగులో సినిమా చేయలేదు.
సార్ మేడం ప్రమోషన్స్ లో..
ఫైనల్ గా పెద్దితో శివన్న టాలీవుడ్ రీ ఎంట్రీ జరుగుతుంది. ఈమధ్యనే విజయ్ సేతుపతి సార్ మేడం తెలుగు ప్రమోషన్స్ లోనే బుచ్చి బాబు సినిమా ఆఫర్ గురించి చొచాయగా హింట్ ఇచ్చాడు. సో పెద్దిలో శివన్న రోల్ చూశాక ఇది విజయ్ సేతుపతి చేసి ఉంటే ఎలా ఉంటుంది అనిపించక తప్పదు. బుచ్చి బాబు పెద్ది సినిమాను పవర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు.
చూస్తుంటే చరణ్ కి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేలా ఉన్నాడు బుచ్చి బాబు. పెద్ది సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పెద్ది ఫస్ట్ షాట్ తోనే మూవీ రేంజ్ ఏంటన్నది చూపించాడు బుచ్చి బాబు.