బీచ్ లో స్టాట్యూ .. ఆ హీరోయిన్.. సేమ్ టు సేమ్..!

తాను చిన్నప్పుడు బీచ్ లో ఒక స్టాట్యూ చూశాను.. ఆ తర్వాత ఆండ్రియాను చూశాను. రెండు సేమ్ అనిపించాయని అన్నారు విజయ్ సేతుపతి.;

Update: 2025-11-10 08:31 GMT

ఈవెంట్ లో పాల్గొనే ప్రతి యాక్టర్ ఆ ఈవెంట్ కి సంబంధించిన లేదా ఆ సినిమాకు సంబంధించి వారిని పొగడం కామనే. స్టార్స్ సైతం వచ్చిన ఈవెంట్.. దానిలో ప్రధానమైన వారి గురించి మాట్లాడతారు. ఐతే అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేస్తుంటారు. లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఒక హీరోయిన్ ని తెగ పొగిడేశారు. తమిళ సినిమా మాస్క్ ఈవెంట్ కి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అటెండ్ అయ్యారు. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఆండ్రియా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు విజయ్ సేతుపతి.

కెరీర్ ఎర్లీ డేస్ లో యాడ్..

తాను చిన్నప్పుడు బీచ్ లో ఒక స్టాట్యూ చూశాను.. ఆ తర్వాత ఆండ్రియాను చూశాను. రెండు సేమ్ అనిపించాయని అన్నారు విజయ్ సేతుపతి. ఆమె కెరీర్ ఎర్లీ డేస్ లో ఒక యాడ్ చేశారు. ఇప్పటికీ ఆమె అలానే ఉన్నారని అన్నారు. నేనే కాదు నా కొడుకు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆమె బెడ్ మీద పడుకుంటుందా లేదా ఫ్రిజ్ లోనా అంటూ ఆండ్రియా గురించి చెప్పారు విజయ్ సేతుపతి.

ఇక ఆండ్రియా గురించి చెప్పాలంటే.. సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు హీరోయిన్ గా కూడా చేసింది. ఆ తర్వాత సైడ్ హీరోయిన్ రోల్స్ చేస్తూ వచ్చింది. ఇప్పటికీ ఆండ్రియా కొన్ని స్పెషల్ రోల్స్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తుంది. తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఆండ్రియా ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తుంది. ఐతే విజయ్ సేతుపతి చెప్పాడని కాదు కానీ ఆండ్రియాకు ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. కానీ ఆమెకు అవకాశాలు మాత్రం అసలు రావట్లేదు.

ఆండ్రియా ఫోటో షూట్స్..

సినిమాలతో పాటు ఆండ్రియా ఫోటో షూట్స్ కి కూడా సూపర్ క్రేజ్ ఉంటుంది. అమ్మడు ఇలా ఫోటో షేర్ చేయగానే అలా వైరల్ అయిపోతుంది. తెలుగులో కూడా ఆండ్రియా ప్రయత్నాలు చేసింది కానీ ఇక్కడ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కోలీవుడ్ లో ఎలాంటి పాత్ర అయినా చేసే ఫిమేల్ ఆర్టిస్ట్ కం హీరోయిన్ గా ఆండ్రియా కెరీర్ కొనసాగిస్తుంది.

ఐతే తనకు వచ్చిన ఈ ఐడెంటిటీ తో ఆమె సంతృప్తిగా ఉంది. మరిన్ని ఛాన్స్ లు రావాలి.. ఎక్కువ సినిమాలు చేయాలనే కోరిక ఉన్నా తన కోసం రాసి పెట్టి ఉంటే తప్పకుండా తన దాకా వస్తాయని నమ్ముతుంది అమ్మడు. ఆండ్రియాపై విజయ్ సేతుపతి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆడియన్స్ లానే ఆండ్రియాని ఇష్టపడే వారిలో విజయ్ సేతుపతి కూడా ఒకరని డిస్కస్ చేస్తున్నారు.

Tags:    

Similar News