రజనీ కోసం విజయ్ చేయక తప్పట్లేదా..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈమధ్య కాలంలో ఎక్కువగా తను లీడ్ రోల్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు.;

Update: 2025-11-27 12:30 GMT

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈమధ్య కాలంలో ఎక్కువగా తను లీడ్ రోల్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. సోలో లీడ్ సినిమాలు చేస్తూ వెరైటీ యాక్టర్ గా వర్సటాలిటీ చూపిస్తున్న అతన్ని నిర్మాతలు స్టార్ సినిమాల్లో విలన్ గా ఇంకా డిఫరెంట్ రోల్స్ లో చూపించారు. ఐతే ఎంత స్టార్ సినిమా అయినా కూడా విలన్ గా చేయడం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న విజయ్ సేతుపతి ఫైనల్ గా ఇక వేరే స్టార్ సినిమాల్లో చేసేది లేదని తెగేసి చెప్పాడు. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత విజయ్ చేస్తున్న సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

జవాన్ సినిమా తర్వాత స్టార్ సినిమాల్లో నటించకూడదనుకున్న విజయ్ సేతుపతి..

తమిళంలో విజయ్ సేతుపతి చేస్తున్న ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉన్నాయి. బాలీవుడ్ లో జవాన్ సినిమా తర్వాత స్టార్ సినిమాల్లో నటించకూడదు అనుకున్న విజయ్ సేతుపతి అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమాలో ఛాన్స్ వచ్చినా చేయనని చెప్పాడట. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ జైలర్ 2 కోసం మాత్రం తన పంతాన్ని పక్కన పెడుతున్నాడని టాక్.

రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో విజయ్ సేతుపతి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారట. విజయ్ సేతుపతి సీన్స్ త్వరలోనే షూట్ చేస్తారని తెలుస్తుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మల్లీ ఎందుకు ఇలాంటి రోల్స్ చేస్తున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నా క్యారెక్టర్ డిమాండ్ ఉంటుంది కాబట్టే ఆయన జైలర్ 2కి ఓకే చెప్పి ఉండొచ్చని భావిస్తున్నారు.

పూరీ సినిమాతో చాలా పెద్ద ప్లాన్..

విజయ్ సేతుపతి తమిళ్ లో ఆల్రెడీ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. అదే కాకుండా తెలుగు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో ఒక సినిమా సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాలు మరోసారి విజయ్ సేతుపతి రేంజ్ తెలియచేస్తాయని అంటున్నారు. పూరీ సినిమాతో చాలా పెద్ద ప్లాన్ తోనే వస్తున్నారు విజయ్ సేతుపతి.

జైలర్ 2లో కూడా స్టార్ క్యామియోస్ ఉంటాయని తెలుస్తుండగా విజయ్ సేతుపతి రోల్ కూడా జస్ట్ క్యామియోగానే అదిరిపోతుందని అంటున్నారు. సో తన ఇమేజ్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలానే జైలర్ 2లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తుంది. సో రజనీ సినిమాలో విజయ్ సేతుపతి ఉన్నాడంటే కచ్చితంగా ఆ రేంజ్ వేరే అన్నట్టు చెప్పొచ్చు. పూరీ సినిమాతో పాటు జైలర్ 2 కోసం కూడా విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. విజయ్ సేతుపతికి తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో సైరా తర్వాత ఉప్పెన సినిమాలో శేషారాయణం పాత్రలో అదరగొట్టారు. ఈసారి పూరీ కథలో హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నారు.

Tags:    

Similar News