ద‌ళ‌ప‌తికి జ‌న నాయ‌గ‌న్ విష‌యంలో మ‌రో షాక్‌!

సెన్సార్ వివాదం త‌లెత్త‌డంతో ఆగిపోయిన ఈ మూవీ చుట్టూ గ‌త కొన్ని నెల‌లుగా నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.;

Update: 2026-03-20 14:10 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన భారీ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `జ‌న నాయ‌గ‌న్‌`. హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా కెవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ కె. నారాయ‌ణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. తెలుగు సూప‌ర్ హిట్ ఫిల్మ్ `భ‌గ‌వంత్ కేస‌రి` ఆధారంగా దీన్ని తెర‌కెక్కించారు. అయితే పూర్తిగా ఈ మూవీని తీసుకోకుండా సెకండ్ హాఫ్‌ని ఇంట‌ర్నేష‌న్ క్రైమ్ ఎలిమెంట్స్‌తో మార్చేశారు. దానికి ఇండియ‌న్ ఆర్మీ నేప‌థ్య స‌న్నివేశాల‌ని జోడించ‌డంతో సినిమా చుట్టూ వివాదం మొద‌లైంది. జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా ఇప్ప‌టికీ రిలీజ్‌కు నోచుకోవ‌డం లేదు.

సెన్సార్ వివాదం త‌లెత్త‌డంతో ఆగిపోయిన ఈ మూవీ చుట్టూ గ‌త కొన్ని నెల‌లుగా నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జ‌న‌వరి 9న వాయిదా ప‌డిన ఈ మూవీ రిలీజ్ విష‌యంలో రెండు నెల‌లు పూర్తి కావ‌స్తున్నా ఇప్ప‌టికీ ఎలాంటి స్ఫ‌స్ట‌త క‌నిపించ‌క‌పోవ‌డం విజ‌య్ అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. విజ‌య్ ఈ మూవీతో సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తున్నాడు. ఇప్ప‌టికే టీవీకే పార్టీని స్థాపించిన విజ‌య్ ఏప్రిల్‌లో త‌మిళ‌నాడులో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీవీకే పార్టీపై పోటీకి దిగుతున్నాడు.

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఇప్ప‌టికే హాట్ ఫేవ‌రేట్‌గా నిలిచిన విజ‌య్ వివాదాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. భార్య విడాకులు కోరుతూ కోర్టుని ఆశ్ర‌యించ‌డం, అదే స‌మ‌యంలో విజ‌య్ స్టార్ హీరోయిన్ త్రిష‌తో క‌లిసి చెన్నైలో జ‌రిగిన ఓ నిర్మాత ఫ్యామిలీ వెడ్డింగ్ ఫంక్ష‌న్‌ని హాజ‌రు కావ‌డం వివాదంగా మార‌డం తెలిసిందే. చుట్టూ స‌మ‌స్య‌ల వ‌ల‌యం ఏర్ప‌డ‌టంతో విజ‌య్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్టు టీవీకే పార్టీ సెక్ర‌ట‌రీ ర‌జ‌నీపై చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దుమారాన్ని రేప‌డ‌మే కాకుండా ర‌జ‌నీ అభిమానుల్లో ఉన్న సింప‌తీని కూడా కిల్ చేసి భారీ న‌ష్టాన్ని మిగిల్చాయి.

ఈ నేప‌థ్యంలోనే ద‌ళ‌ప‌తి విజ‌య్‌పై మ‌రో పిడుగు ప‌డింది. అదే జ‌న నాయ‌గ‌న్‌`. ఈ సినిమా గ‌త రెండు నెల‌లుగా రిలీజ్ నోచుకోవ‌డం లేదు. సెన్సార్ వారి అభ్యంత‌రాల కార‌ణంగా రివైజింగ్ క‌మిటీ త‌లుపుత‌ట్టిన ఈ మూవీ టీమ్ సెన్సార్ స‌ర్టిఫికెట్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గ‌తంలో సీబీఎఫ్‌సీ మెంబ‌ర్‌ల‌లో ఒక‌రు అస్వ‌స్థత‌కు గురి కావ‌డంతో రివైజింగ్ క‌మిటీ ఈ సినిమాని ప‌రిశీలించే విష‌యాన్ని వాయిదా వేసింది.

అయితే తాజాగా సీబీఎఫ్‌సీ వర్గాలు `జ‌న నాయ‌గ‌న్‌` టీమ్‌కు షాక్ ఇచ్చిన‌ట్టుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికీ `జ‌న నాయ‌గ‌న్‌` సినిమాని రివైజింగ్ క‌మిటీ స‌భ్యుల చూడ‌లేద‌ని, తాజాగా ఎల‌క్ష‌న్ కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన నేఫ‌థ్యంలో ఇప్ప‌ట్లో రివైజింగ్ క‌మిటీ ఈ సినిమాని చూసి సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ చేసే అవ‌కాశం లేద‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే మేక‌ర్స్ మాత్రం ఈ మూవీని అన్నీ క‌రెక్ట్‌గా కుదిరితే మే 8న అంటే త‌మిళ‌నాడు ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News