విరోష్' పెళ్లి.. 'రణబాలి' రేంజ్ ను మార్చేసిందా?
టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి కోసం కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది.;
టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి కోసం కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. రీసెంట్ గా రాజస్థాన్ లో వివాహ బంధంతో వారిద్దరూ ఒక్కటవ్వగా.. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తమ మ్యారేజ్ పిక్స్ ను మెల్లగా విజయ్- రష్మిక పోస్ట్ చేస్తుండడంతో అవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అదే సమయంలో సినీ ప్రియుల దృష్టి రణబాలి మూవీపై పడింది. ఆ చిత్రంలో విజయ్, రష్మిక లీడ్ రోల్స్ లో నటిస్తుండడం అందుకు కారణం. ఇప్పటికే వారిద్దరూ గీత గోవిందం, టాక్సీవాలా సినిమాల్లో కలిసి నటించి మెప్పించారు. ఇప్పుడు రణబాలి కోసం మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే ఆ సినిమాపై ఉన్న బజ్ ఇప్పటి వరకు ఓ ఎత్తు.. ఇప్పుడు మరో ఎత్తు అన్నట్లుగా పరిస్థితి మారింది. ముందు నుంచి సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉన్నా.. రీసెంట్ గా ఇంకా పెరిగాయి. విజయ్, రష్మిక పెళ్లి చేసుకోవడంతోపాటు సినిమా నుంచి వెడ్డింగ్ పోస్టర్, సాంగ్ అందుకు ముఖ్య కారణం. దీంతో ఇప్పుడు మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఓ ప్రముఖ ఓటీటీ నుంచి భారీ ఆఫర్ రావడంతో సినిమా బడ్జెట్ ను పెంచేందుకు సిద్ధమవుతున్నారట. నిజానికి మేకర్స్ పెద్ద ఎత్తున బడ్జెట్ తోనే రణబాలి మూవీని నిర్మించాలనుకున్నారు. కానీ విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్, కింగ్ డమ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రాణించకపోవడంతో ఓటీటీ సంస్థలు హై రేంజ్ డీల్స్ ను ఫిక్స్ చేసుకునేందుకు ఏవీ ముందుకు రాలేదు.
దీంతో బడ్జెట్ విషయంలో నిర్మాతలు జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. కానీ సినిమాపై హైప్ పెరగడంతో ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రణబాలి డిజిటల్ హక్కుల కోసం భారీ ఆఫర్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఆ డీల్ ఫైనల్ అయితే సినిమాకు మరింత గ్రాండ్ లుక్ ఇవ్వాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్ సీక్వెన్సులు, విదేశీ లొకేషన్లు, హైఎండ్ టెక్నికల్ వర్క్ తో చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీసుకురావాలని భావిస్తున్నారట.
ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ చేసినట్లు తెలుస్తుండగా.. పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు బడ్జెట్ పెంచేందుకు సిద్ధమయ్యారని వినికిడి. ఏదేమైనా ఇప్పుడు రణబాలి మూవీ.. ఇప్పుడు విజయ్ రష్మిక జంటకు ఉన్న క్రేజ్ తో కొత్త ఊపందుకుంది. బడ్జెట్ పెరగడం, ఓటీటీ డీల్ రావడం, అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు.. అన్నీ కలిపి సినిమాను ఆసక్తికర ప్రాజెక్ట్ గా మార్చేశాయి. సెప్టెంబర్ 11న రిలీజ్ కానున్న రణబాలి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.