విజయ్ దేవరకొండ విశ్వరూపం.. ఫ్యాన్స్ మార్క్ చేసుకోవాల్సిందే..!

అందులో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబో మూవీ ఒకటి ఉంది. రాహుల్ సంకృత్యన్ ఈసారి పీరియాడికల్ కథతో ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.;

Update: 2025-10-16 05:49 GMT

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ క్రేజీ కాంబినేషన్స్ అన్నిటినీ సెట్ చేస్తుంది. స్టార్ హీరోలతో పాటు యువ హీరోల కాంబినేషన్ సినిమాలను కూడా అందులో ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ యువ హీరోలతో కూడా అందుకు ఏమాత్రం తగ్గని విధంగా సినిమాలు సెట్ చేస్తున్నారు. అందులో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబో మూవీ ఒకటి ఉంది. రాహుల్ సంకృత్యన్ ఈసారి పీరియాడికల్ కథతో ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

విజయ్ దేవరకొండతో సినిమా అప్డేట్..

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమా వీడీ 14వ సినిమాగా వస్తుంది. ఐతే లేటెస్ట్ గా ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మైత్రి తో పనిచేస్తున్న డైరెక్టర్స్ అంతా కూడా ఈవెంట్ కి వచ్చారు. అందులో రాహుల్ సంకృత్యన్ కూడా ఉన్నాడు. రాహుల్ మైక్ అందుకోగానే విజయ్ దేవరకొండతో సినిమా అప్డేట్ ఇచ్చాడు. సినిమా బాగా వస్తుందని.. సినిమాలో విజయ్ దేవరకొండని చూసి షాక్ అవుతారని అనాడు. అంతేకాదు విజయ్ దేవరకొండ విశ్వరూపం మీరు చూస్తారని చెప్పాడు రాహుల్ సంకృత్యన్.

విజయ్ రాహుల్ సంకృత్యన్ ఆల్రెడీ టాక్సీవాలా సినిమాకు పనిచేశారు. ఆ సినిమా టైం లోనే వీరిద్దరి కాంబో క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్ తో రాహుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక రాబోతున్న వీడీ 14 సినిమాతో మరోసారి రాహుల్ తన డైరెక్షన్ స్టామినా చూపించబోతున్నాడు. ఈ సినిమాను బ్రిటీష్ కాలం కథతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన రియల్ స్టోరీతో తెరకెక్కిస్తున్నారట.

రౌడీ ఫ్యాన్స్ కి సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్..

విజయ్ దేవరకొండ విశ్వరూపం అనేసరికి రౌడీ ఫ్యాన్స్ కి సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఆల్రెడీ రాహుల్ పై ఉన్న కాన్ఫిడెన్స్ ఒక రేంజ్ లో ఉండగా మళ్లీ ఈ కామెంట్స్ మరింత క్రేజీగా మారాయి. రాహుల్ చేసిన కామెంట్స్ దేవరకొండ ఫ్యాన్స్ మార్క్ చేసుకున్నారు.

ఈ సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే విజయ్ కు జోడీగా రష్మిక నటిచడం.. ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అన్న న్యూస్ మొన్నటిదాకా వైరల్ కాగా ఎంగేజ్మెంట్ తో ఇద్దరు కన్ ఫర్మ్ చేశారు. సినిమా పీరియాడికల్ మూవీ కాబట్టి కచ్చితంగా అప్పటికి పెళ్లి కూడా అవుతుంది. సో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు ఈ ప్రాజెక్ట్ మరింత స్పెషల్ అవుతుంది. మరి రాహుల్ అంత గట్టిగా చెప్పాడంటే మాత్రం సినిమాలో ఏదో ఉండి ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అవుతున్నారు.

Tags:    

Similar News