వారి రికార్డులు బ్రేక్.. గ్లోబల్ రేంజ్ లో రెండవసారి విజయ్ - రష్మిక సంచలనం!
ఇప్పుడు ఏకంగా రెండవసారి ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా వారి రికార్డులను బ్రేక్ చేస్తూ.. గుర్తింపు అందుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ జంట ఇటీవల తమ పెళ్లితో అటు పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రెండవసారి ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా వారి రికార్డులను బ్రేక్ చేస్తూ.. గుర్తింపు అందుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. దాదాపు 8 సంవత్సరాలుగా రహస్యంగా ప్రేమాయణం కొనసాగించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఉదయపూర్ వేదికగా రెండు సాంప్రదాయ పద్ధతుల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లయ్యాక కూడా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో ఇంటర్నేషనల్ రికార్డులు తిరగరాస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈ జంట నటించిన ఎయిర్ బీఎన్బీ కపుల్ యాడ్ ఇంస్టాగ్రామ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ క్యూట్ కపుల్ పోస్ట్ కు ఏకంగా 9.1 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. అటు ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టా లో ఒక బ్రాండ్ యాడ్ కి ఈ స్థాయిలో లైక్స్ రావడం ఇది రెండవసారి కావడం గమనార్హం .
అయితే ఇక్కడ అసలు ఏమిటంటే ట్విస్ట్ ఏంటంటే.. ప్రపంచ స్థాయి లిస్టులో మొదటి స్థానం రికార్డు కూడా ఈ క్రేజీ జంటదే కావడం విశేషం. గతంలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన మాన్యవర్ వెడ్డింగ్ క్యాంపెయిన్ యాడ్ కు 11.5 మిలియన్ లైక్స్, 104 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా.. అటు ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్స్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కలసి చేసిన లూయిస్ విట్టన్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్ రికార్డులను కూడా ఈ టాలీవుడ్ జోడి బద్దలు కొట్టడంతో ఈ విషయం కాస్త గ్లోబల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికైతే ఈ జంట ఒక్క యాడ్ తో ఇప్పుడు ఏకంగా రెండవసారి ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.
ఇక విజయ్ రష్మిక మందన్న విషయానికి వస్తే.. వీరిద్దరూ కలిసి తొలిసారి గీతాగోవిందం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మూడవసారి రణబాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు జంటగా రాబోతున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలసి జంటగా నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం . ఇక మరొకవైపు విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన సినిమా చేస్తుండగా.. ఇటు రష్మిక బాలీవుడ్ లో కాక్ టెయిల్ 2 చిత్రంలో నటిస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అలాగే తెలుగులో మైసా చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.