విరోష్ కపుల్ గ్లోబల్ రికార్డ్.. ఇన్ స్టాలో ఏకంగా..

సోషల్ మీడియాలో ఆ రేంజ్ లో రెస్పాన్స్ రావడం వెనుక విజయ్- రష్మిక జంటకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Update: 2026-05-13 17:48 GMT

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అభిమానులు ప్రేమగా విరోష్ అంటూ పిలుచుకునే ఆ జంట కలిసి చేసిన లేటెస్ట్ ఎయిర్‌ బీఎన్‌ బీ కపుల్ యాడ్ ఇప్పుడు ఇన్‌ స్టాగ్రామ్‌ లో రికార్డు స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. ఆ యాడ్‌ కు ఇప్పటికే 9.1 మిలియన్లకు పైగా లైక్స్ రావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లైకులు సాధించిన యాడ్ పోస్టుల్లో రెండో స్థానంలో నిలిచింది.

ఇక ఫస్ట్ ప్లేస్‌ లో కూడా ఇదే జంట చేసిన యాడ్ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. విజయ్- రష్మిక కలిసి చేసిన మాన్యవార్ వెడ్డింగ్ క్యాంపెయిన్ యాడ్ గతంలో 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డు సృష్టించింది. ఆ యాడ్‌ కు 104 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అంతేకాదు, ప్రపంచ ఫుట్‌ బాల్ దిగ్గజాలు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కలిసి చేసిన లూయిస్ విట్టన్ యాడ్ పోస్టుకు వచ్చిన లైక్స్ కంటే విరోష్ చేసిన యాడ్‌ కు ఎక్కువ రెస్పాన్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో ఆ రేంజ్ లో రెస్పాన్స్ రావడం వెనుక విజయ్- రష్మిక జంటకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ సోషల్ మీడియాలో అనేక చర్చలు జరిగాయి. అయితే వ్యక్తిగత విషయాలపై పెద్దగా స్పందించకుండా తమ కెమిస్ట్రీతోనే అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చారు. రీసెంట్ గా మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన్ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలిలో రష్మిక మందన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఆ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో వారిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

అటు రష్మిక మందన్నా కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌ లో షాహిద్ కపూర్‌ తో కలిసి కాక్‌ టెయిల్-2లో నటిస్తుండగా, తెలుగులో మైసా చిత్రంలో కనిపించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ ఆమె కెరీర్ జోరుగా సాగుతోంది. సినిమాల పరంగా ఎవరికి వారు బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ జంటకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఎయిర్‌ బీఎన్‌ బీ యాడ్‌ తో మరో గ్లోబల్ రికార్డ్ నమోదవడంతో విరోష్ జోడీ పేరు మరోసారి ట్రెండింగ్‌ లోకి వచ్చింది.

Tags:    

Similar News