స్టార్ హీరోల గాయాలు - విడుదల తేదీలపై ఎఫెక్ట్!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లు రూపుదిద్దుకుంటున్నాయి.

Update: 2026-08-13 10:30 GMT

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఈ హై-వోల్టేజ్ స్టంట్స్ ..కఠినమైన యాక్షన్ కొరియోగ్రఫీ కొన్నిసార్లు హీరోల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలు షూటింగ్ సెట్లలో గాయాలపాలు కావడం, ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవడం వల్ల చిత్రాల విడుదల తేదీలు తారుమారవుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న‌టించాల్సిన మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ `ఆర్సీ 17` షూటింగ్ షెడ్యూల్ కూడా ఇదే కారణంతో కొంత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కుతున్న సినిమా కోసం అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తగిలిన చిన్నపాటి గాయం కారణంగా ప ట్టాలెక్కాల్సిన ప్రాజెక్ట్ వెన‌క్కి త‌గ్గుతోంది. ఈ డిలే ఓవరాల్ ప్రొడక్షన్ ప్లాన్‌పై ప్రభావం చూపుతోంది.

మరోవైపు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల విడుదల తేదీలపై కూడా ఈ గాయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వరుస పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న తారక్ `డ్రాగ‌న్` సినిమా షూటింగ్ సమయంలో తగిలిన గాయం ఏకంగా శ‌స్త్ర చికిత్స‌కు దారితీసింది. స‌ర్జ‌రీ అనంత‌రం తార‌క్ నెల‌ల పాటు విశ్రాంతి తీసుకునే అవ‌కాశం ఉంది.

ఈ ఊహించని విరామాల వల్ల తార‌క్ లైనప్‌లో ఉన్న చిత్రాల రిలీజ్ డేట్స్ ముందుకు వెళ్లే పరిస్థితి తలెత్తింది. నందమూరి బాలకృష్ణ - దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. బాలయ్య ఎనర్జిటిక్ స్టంట్స్ .. మాస్ యాక్షన్ సీన్ల షూటింగ్ సమయంలో ఎదురైన చిన్నపాటి శారీరక ఇబ్బందులు, గాయాల కారణంగా సినిమా షూటింగ్ కూడా కొద్దిగా డిలే అవుతుంది. దీంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం రిలీజ్ ప్లానింగ్‌లోనూ మార్పులు చోటు చేసు కుంటున్నాయి. దీంతొ పాటు కొర‌టాల శివ‌తో లైన్ లో ఉన్న సినిమా కూడా డిలే అవుతుంది.

సినిమా అంటేనే రిస్క్‌తో కూడుకున్న ప్రయాణం. ముఖ్యంగా మాస్ యాక్షన్ చిత్రాల్లో హీరోలు డూప్‌లను వాడకుండా స్వయంగా రిస్క్ చేసి సాహస సన్నివేశాల్లో నటించడం పరిపాటిగా మారింది. ఈ సాహసాల వెనుక శరీరంపై పడే గాయాలు కేవలం హీరోల వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల క్యాలెండర్‌ను కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయి.

ఏదేమైనా? స్టార్ హీరోల భద్రత , ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మేకర్స్ ఈ డిలేలను సానుకూలంగానే స్వీకరిస్తున్నారు. గాయాల నుంచి కోలుకుని మరింత స్ట్రాంగ్‌గా సెట్స్‌లోకి వస్తున్న హీరోలు, బాక్సాఫీస్ వద్ద మాత్రం తమ సినిమాలతో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News