జననాయకుడు వర్సెస్ రాజాసాబ్.. అప్పటికి లెక్కలు మారడం పక్కా!

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ జననాయగన్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కు రెడీ అవుతుంది.;

Update: 2025-08-29 19:30 GMT

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ జననాయగన్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కు రెడీ అవుతుంది. 2026 జనవరి 9న గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా రాజాసాబ్ కూడా అదే రోజు రానుంది. ఈ మేరకు నిర్మాత టిజి విశ్వప్రసాద్ ప్రకటించారు. అయితే ఆయన అనౌన్స్ మెంట్ తో తమిళనాడు, కేరళ, కర్ణాటక బయ్యర్లు కంగారు పడుతున్నారు.

ఒకే రోజు రెండు భారీ చిత్రాలు థియేటర్లకు రావడం బయ్యర్లకు ఇష్టం లేదు. జన నాయకుడు సినిమా తక్కువ అంచనా వేస్తున్నారా? అంటూ దళపతి అభిమానులు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరయ్యే కొద్దీ ఇలాంటివి ఎక్కువ అవ్వడం పక్కా్! కానీ, ఇక్కడ ఒక్కో ఏరియాలో ఒక్కో హీరో స్టామినా ఒక్కోలా ఉంది.

విజయ్ సినిమా కోసం తమిళనాడు ఎగ్జిబిటర్లు ఫుల్ సపోర్ట్ ఉంటారు. ప్రేక్షకులను ఎక్కువగా థియేటర్లలకు రప్పించేలా చూస్తారు. అయితే రాజకీయంగా రూలింగ్ పార్టీతో విజయ్ కయ్యానిలి కాలు దువ్వారు. ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధితో సంబంధాలు సరిగ్గా లేవు. తమిళనాడులో ఏ సినిమాకైనా రెడ్ జయంట్ కంపెనీ వాళ్లే డిస్ట్రిబ్యూషన్ లో ఆధిపత్యం చెలాయిస్తోంది. వాళ్ల సపోర్ట్ లేకుండా ఎక్కువ స్క్రీన్లు తెచ్చుకోవడం కష్టం. అందుకే ఇది రాజా సాబ్ కు బెనిఫిట్ అవుతుందని విశ్లేషకుల అంచనా.

అయితే ఇలాంటివి ఎన్ని కలిసొచ్చినా.. విజయ్ ముందు నిలబడడం కష్టమే. ఆయన సినిమాకు ఇప్పుడు హైప్ ఎక్కువగా లేకుండా..రిలీజ్ నాటికి లెక్కలు మారిపోతాయి. పైగా ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని మూవీటీమ్ ఖండిస్తూ వస్తోంది. కానీ రిలీజ్ అయ్యే దాకా దీనిపై క్లారిటీ రాదు. రాజా సాబ్ కు ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ తో పాటు ఇతర ఏరియాల్లో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవాలంటే.. మార్కెటింగ్ అత్యంత అవసరం. దసరా పండగకు ట్రైలర్ రానుంది. ప్రస్తుతం మేకర్స్ అదే పనిలో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News