'జన నాయగన్'..అవే కొంపముంచాయా?
దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సినిమా `జన నాయగన్`. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించి ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.;
దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సినిమా `జన నాయగన్`. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించి ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. తెలుగులో `జన నాయకుడు`గా రానుంది. ట్రైలర్ రిలీజ్ దగ్గరి నుంచి సినిమాపై అంచనాలు పెరిగిపోవడం, ఇది పక్కా తెలుగు సినిమా `భగవంత్ కేసరి`కి రీమేక్ అని తేలడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అయితే పాన్ ఇండియా మూవీగా జనవరి 9న రిలీజ్ కావాల్సిన `జన నాయగన్` సెన్సార్ ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది.
సెన్సార్ వివాదం కారణంగా నిర్మాణ సంస్థ మద్రాప్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి తీర్పుని రిజర్వ్ చేసి జనవరి 9 ఉదయం తుది తీర్పుని వెలువరిస్తానని ప్రకటించడంతో చివరి నిమిషంలో `జన నాయగన్` రిలీజ్‌ని మేకర్స్ వాయిదా వేస్తున్నామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ వర్గాలు హీరో విజయ్‌కి అండగా నిలుస్తున్నాయి. హీరోలు, డైరెక్టర్లు సెన్సార్‌పై మండిపడుతూ ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతూ `జన నాయగన్` కోసం నిలబడండి అంటున్నారు.
సెన్సార్ బోర్డ్ న్యాయంగా వ్యవవరించకపోవడం వల్ల కోలీవుడ్ ఇండస్ట్రీకి తీరని నష్టం కలిగిందని, దీనిని అందరూ ఖండించాలని ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే `జన నాయగన్` విషయంలో తప్పెక్కడ జరిగింది? ..సెన్నార్ బోర్డ్ సర్తిఫికెట్ జారీచేసే విషయంలో ఎందుకు ఇంత బెట్టుచేస్తోంది?. విజయ్ రాజకీయ అరంగేట్రమే ఇందుకు కారణమా? లేక సినిమాలోనే వివాదాస్పద అంశాలు ఉన్నాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌లో విజయ్ పలికిన సంభాషణలు, బాబి డియోల్ క్యారెక్టర్ ఎంట్రీ, అతని పాత్రని మలిచిన విధానం, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలని ఆరాతీస్తున్నారు.
జనవరి 9న భారీ స్థాయిలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ని రీసెంట్‌గా మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. చేతులకు బేడీలతో బాబీ డియోల్ ఎంట్రీ ఇస్తున్న వీడియోలో నల్లజాతీయులు ప్రొటెస్ట్ చేయడం.. అదే సమయంలో నల్లజాతి కమెండోలు వారిని అదుపు చేస్తున్న దృశ్యాలు... బ్రూటల్ మర్డర్స్... ఇప్పటి నుంచి 30వ రోజున ఇండియా నా కాళ్లకింద ఉంటుంది` వంటి డైలాగ్, ఇండియన్ ఆర్మీ ట్రక్కుల్లోంచి దిగుతున్న విజువల్స్..
డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ చేత వేయించిన `కాంతారా` తరహా వేషధారణ, ఆ నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు.. ఓ కమ్యూనిటీ వారిని కించపరిచే విధంగా ఉన్నాయని, ఇండియన్ సోల్జర్స్‌ని చూపించిన విధానంపై కూడా సెన్సార్ వారు అభ్యంతరాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా బాబి డియోల్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఇవన్నీ `జన నాయగన్`కు సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడానికి ప్రధాన కారణాలుగా నిలిచినట్టు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.