దళపతి ఫ్యాన్స్ హర్ట్ అయితే మాత్రం..!
కోలీవుడ్ లో దళపతి విజయ్ తన చివరి సినిమా జన నాయగన్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ లాస్ట్ మూవీని సెన్సేషనల్ హిట్ చేయాలని ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.;
కోలీవుడ్ లో దళపతి విజయ్ తన చివరి సినిమా జన నాయగన్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ లాస్ట్ మూవీని సెన్సేషనల్ హిట్ చేయాలని ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. దళపతి విజయ్ హీరోగా వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జన నాయగన్ ఈ సినిమాలో పూజా హెగ్దే, మమితా బైజు కూడా నటిస్తున్నారు. నెక్స్ట్ సంక్రాంతికి జన నాయగన్ సినిమా రిలీజ్ లాక్ చేశారు. జనవరి 9న ఈ మూవీ రిలీజ్ అనుకుంటున్నారు.
పొంగల్ కి శివ కార్తికేయన్ పరాశక్తి..
ఐతే కోలీవుడ్ లో ఈ పొంగల్ కి శివ కార్తికేయన్ కూడా పరాశక్తి సినిమాతో రాబోతున్నాడు. సుధ కొంగర డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ బాగున్నాయి. ఐతే ఈ సినిమాను ముందు సంక్రాంతికి అంటే జనవరి 14న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక నాలుగైదు రోజులు ముందుకు తెచ్చే ప్లాన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే శివ కార్తికేయన్ పరాశక్తి తమిళ్ తో పాటు తెలుగులో కూడా అదే డేట్ న వదలాలని చూస్తున్నారు.
పరాశక్తి సినిమా జనవరి 9 లేదా 10న రిలీజ్ డేట్ చూస్తున్నారట. అలా అయితే కచ్చితంగా దళపతి విజయ్ జన నాయగన్ కి పోటీ వస్తుంది. ముందు అనుకున్నట్టుగా పరాశక్తి జనవరి 14న వస్తే ఐదు రోజులు గ్యాప్ ఉంది కాబట్టి రెండు సినిమాలకు పెద్దగా ఎఫెక్ట్ పడదు. కానీ జనవరి 9, 10 తేదీన పరాశక్తి వస్తే మాత్రం జన నాయగన్ మీద ఇంపాక్ట్ పడుతుంది.
విజయ్ తో పోటీ వచ్చేలా రిస్క్..
స్టార్ సినిమాలు ఒకే రోజు రెండు సినిమాలు వచ్చినా ప్రాబ్లం ఏముంది అనుకోవచ్చు. మామూలుగా అయితే పర్లేదు కానీ ఇది దళపతి చివరి సినిమా అవ్వడం వల్ల ఆయన ఫ్యాన్స్ తమ హీరో సినిమాకు ఎలాంటి పోటీ ఉండకూదదని భావిస్తున్నారు. తెలుగు రిలీజ్ కోసం శివ కార్తికేయన్ విజయ్ తో పోటీ వచ్చేలా రిస్క్ తీసుకుంటాడా లేదా అన్నది చూడాలి.
తెలుగులో మాత్రం ఈ సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్, ప్రభాస్ రాజా సాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, శర్వానంద్ నారి నారి నడుమ మురారి వస్తున్నాయి. ఆల్రెడీ తెలుగులోనే ఐదు సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఈ టైం లో దళపతి విజయ్, శివ కార్తికేయన్ సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో ఇక్కడ థియేటర్ల సమస్య కచ్చితంగా ఏర్పడుతుంది. సో మరి ఈ మూవీస్ రిలీజ్ టైం లో ఎలా సర్ధుబాట్లు జరుగుతాయన్నది చూడాలి.
ఏది ఏమైనా సంక్రాంతికి సినిమాల పండగ సినీ లవర్స్ కి సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించేలా ఉంది. ఈసారి సంక్రాంతికి మాక్సిమం సినిమాలు అన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ తోనే ఎంటర్టైనింగ్ చేయడానికే వస్తున్నాయి. వాటిలో ఏ సినిమా ప్రేక్షకుల నుంచి ఆమోదం అందుకుంటుందో చూడాలి.