ఫైనల్ గా దొరికేసిన విజయ్ - రష్మిక.. వీడియో వైరల్!

అలా ఎన్నోసార్లు ప్రేక్షకులను, అభిమానులను బురిడీ కొట్టించాలని చూసినా అభిమానులు కూడా నమ్మలేదు. పైగా అటు రష్మిక కూడా విజయ్ దేవరకొండ ను వివాహం చేసుకోబోతున్నట్లు హింట్ కూడా ఇచ్చింది.;

Update: 2026-01-05 06:18 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రూమర్డ్ జంటగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2018లో వచ్చిన గీతా గోవిందం సినిమాతో తొలిసారి తెరపై కనిపించింది ఈ జంట. అప్పుడే వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ముగ్ధులయ్యారు. జంట అంటే ఇలా ఉండాలి అని వీరిపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. అంతలా ఆ సినిమాలో ఒదిగిపోయిన ఈ జంట అప్పుడే ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో 2019లో డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది. ఈ రెండు చిత్రాల సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారనే వార్తలు గట్టిగా వినిపించాయి.

పైగా వెకేషన్ లకి వీరిద్దరూ కలిసి వెళ్లడమే కాకుండా అప్పుడప్పుడు వెకేషన్ లకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు కూడా.. ఇకపోతే విడివిడిగా ఉంటున్నట్లు ఎన్నోసార్లు ఫోటోలు షేర్ చేసినా.. అవి ఏ రోజు కూడా అభిమానులకు నమ్యశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే వీరు పంచుకున్న ఆ ఫోటోల బ్యాక్ గ్రౌండ్ చూస్తే వీరిద్దరూ ఒకే చోట ఉన్నారని స్పష్టంగా అనిపించేది. అలా ఎన్నోసార్లు ప్రేక్షకులను, అభిమానులను బురిడీ కొట్టించాలని చూసినా అభిమానులు కూడా నమ్మలేదు. పైగా అటు రష్మిక కూడా విజయ్ దేవరకొండ ను వివాహం చేసుకోబోతున్నట్లు హింట్ కూడా ఇచ్చింది.

ఇకపోతే గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఆ విషయాన్ని అభిమానులతో అధికారికంగా ప్రకటించలేదు. కానీ వీరి చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలే వీరికి నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని కన్ఫామ్ చేశాయి. ఇకపోతే న్యూ ఇయర్ సందర్భంగా అటు రష్మిక మందన్న ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరు రోమ్ నగరానికి వెళ్లారు. వెకేషన్ కి సంబంధించి రష్మిక ఆ ఫోటోలను పంచుకోగా అందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా కనిపించారు. ఇక అప్పుడే వీరు ఫ్యామిలీలతో కలిసి వెళ్లారని అందరూ కన్ఫామ్ చేసుకున్నారు. దీనికి తోడు విజయ్ దేవరకొండ పంచుకున్న ఫోటోలలో కూడా రష్మిక వెనక నుండి విజయ్ ను పట్టుకున్నట్టు కొన్ని ఫోటోలు విజయ్ పంచుకోగా.. దాదాపు కన్ఫామ్ చేసుకున్నారు.

అయితే ఇప్పుడు ఏకంగా ఇద్దరూ కలిసి ఏర్పోర్ట్ నుంచి వెకేషన్ ముగించుకొని బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇన్ని రోజులు రహస్యంగా మెయింటైన్ చేసిన ఈ జంట ఎట్టకేలకు బయటపడ్డారు అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా తమ బంధాన్ని ఈ విధంగా ఈ జంట రివీల్ చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు వీరిద్దరూ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. దీనిపై స్పందించిన రష్మిక సమయం వచ్చినప్పుడు తామే ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News