విజయ్ దేవరకొండ స్టైలిష్ యాడ్ చూశారా?

రీసెంట్ గా "హౌస్ ఆఫ్ మెక్‌ డోవెల్స్ సోడా" అనే సోడా బ్రాండ్‌ కు అంబాసిడర్‌ గా నియమితులయ్యారు. గత నెలలోనే ఆ ప్రకటన రాగా.. ఇప్పుడు హౌస్ ఆఫ్ మెక్‌ డోవెల్స్ సోడా యాడ్ లో మెరిశారు.;

Update: 2025-09-24 15:45 GMT

యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు.. ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. తన బ్రాండ్ ను ఓ రేంజ్ లో పెంచుకున్నారు. విజయ్ అంటేనే ఓ బ్రాండ్ అన్నట్లు ఫేమ్ దక్కించుకున్నారు.

ఇప్పుడు అటు సినిమాలు.. ఇటు బిజినెస్ లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ లో పెట్టుబడులు పెట్టిన విజయ్.. క్లాతింగ్ బిజినెస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని రంగాల్లో తన మార్క్ ను చూపిస్తున్నారు. అదే సమయంలో వివిధ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

రీసెంట్ గా "హౌస్ ఆఫ్ మెక్‌ డోవెల్స్ సోడా" అనే సోడా బ్రాండ్‌ కు అంబాసిడర్‌ గా నియమితులయ్యారు. గత నెలలోనే ఆ ప్రకటన రాగా.. ఇప్పుడు హౌస్ ఆఫ్ మెక్‌ డోవెల్స్ సోడా యాడ్ లో మెరిశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.

మంచు కొండలు సీన్ తో యాడ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎలా చేస్తాం మామ? అంటూ విజయ్ ను తన ఫ్రెండ్ క్వశ్చన్ చేస్తారు. దీంతో ఫ్రెండ్స్ కలిసి ఏం సాధించలేరా? మొదటిసారి చంద్రుడిపైకి ఎవరు వెళ్లారు.. ఫ్రెండ్సే కదా!.. వరల్డ్ లోనే మొదటి సోషల్ మీడియా ఎవరు తీశారు.. ఫ్రెండ్సే అంటూ స్నేహం గొప్పతనాన్ని చెబుతారు.

అయినా మనమంతా కలిసి కూడా.. మనం చేసి తీరుతాం మొదటిసారి.. అని అంటారు. ఆ తర్వాత విజయ్.. తన ఫ్రెండ్స్ తో కలిసి స్నో డ్రైవ్ చేశారు. చేయండి ఏదైనా మొదటి సారి.. దోస్తులు పక్కన ఉంటే మరి.. అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ బాగుంది. తొలిసారి తొలిసారి.. అంటూ వచ్చిన మ్యూజిక్ కూడా మెప్పిస్తుంది.

అయితే ఓవరాల్ గా హౌస్ ఆఫ్ మెక్‌ డోవెల్స్ సోడా యాడ్ అదిరిపోయిందని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. విజయ్ చాలా స్టైలిష్ గా ఉన్నారని చెబుతున్నారు. లుక్ సూపర్ గా ఉందని అంటున్నారు. ఫ్యాన్స్.. యాడ్ ను ఫుల్ గా ట్రెండ్ చేస్తున్నారు. మరి మీరు విజయ్ కొత్త యాడ్ ను చూశారా?.. మీకెలా అనిపించింది?

Tags:    

Similar News