కింగ్‌డ‌మ్ ట్రైల‌ర్ డిలే.. అస‌లేం జ‌రుగుతోంది?

ఇక కింగ్ డ‌మ్ సినిమా గురించి నాగ‌వంశీ వెల్ల‌డించారు. ఆయ‌న మాట్లాడుతూ-`` రెండున్న‌రేళ్ల క‌ష్టమిది. గౌత‌మ్ ఐదేళ్లు క‌ష్ట‌ప‌డి రాసిన క‌థ‌. రెండున్న‌రేళ్లుగా సినిమా నిర్మాణంలో ఉంది.;

Update: 2025-07-26 16:00 GMT

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన `కింగ్ డ‌మ్` ఈనెల 31న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ శ‌నివారం సాయంత్రం తిరుప‌తిలో ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌లో చిత్ర‌బృందం పాల్గొంది. అయితే ఈ వేదిక వ‌ద్ద ఉన్న వారికి మాత్ర‌మే ట్రైల‌ర్ ని వీక్షించే అవ‌కాశం ల‌భించింది. ఇంకా ట్రైల‌ర్ యూట్యూబ్ లో విడుద‌ల కాలేదు. ట్రైల‌ర్ రిలీజ్ ఆల‌స్య‌మైంది. దీంతో యూట్యూబ్ లో ట్రైల‌ర్ కోసం వెతికిన వారికి అది క‌నిపించ‌క‌పోవ‌డం గంద‌ర‌గోళానికి దారి తీసింది. అయితే ఈ డిలేకు కార‌ణం కింగ్ డ‌మ్ ప్ర‌చార‌ వేదిక‌పైకి వ‌చ్చిన నిర్మాత నాగ‌వంశీ వెల్ల‌డించారు.

చెన్నైలో ప‌ని ఇంకా పూర్తి కాలేదు... ట్రైల‌ర్ ఇంకో అర్థ‌గంట‌లో యూట్యూబ్ లో లోడ్ అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఇక కింగ్ డ‌మ్ సినిమా గురించి నాగ‌వంశీ వెల్ల‌డించారు. ఆయ‌న మాట్లాడుతూ-`` రెండున్న‌రేళ్ల క‌ష్టమిది. గౌత‌మ్ ఐదేళ్లు క‌ష్ట‌ప‌డి రాసిన క‌థ‌. రెండున్న‌రేళ్లుగా సినిమా నిర్మాణంలో ఉంది. క‌చ్ఛితంగా తెలుగు ఆడియెన్ కి ఒక కొత్త ర‌క‌మైన యాక్ష‌న్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాను అందిస్తున్నాము. మీరంతా థియ‌ట‌ర్ల‌కు వ‌చ్చి ఆద‌రించండి. ట్రైల‌ర్ లో కేవ‌లం శాంపిల్ మాత్ర‌మే చూపించాం. రౌడీ బోయ్ లో ఈ నాలుగైదేల్ల‌లో మిస్స‌యిన‌ది ఇప్పుడు చూస్తారు. అర్జున్ రెడ్డి క‌ళ్ల‌లో ఉన్న‌ది ఈ సినిమాలో క‌నిపిస్తుంది!`` అని అన్నారు.

గౌత‌మ్ నేను జాగ్ర‌త్త‌గా ఉన్నాం. అన్నిటికీ మించి అతిగా జాగ్ర‌త్త ప‌డ్డ విజ‌య్ కి ఈసారి త‌ప్పు దొర్ల‌కూడ‌ద‌ని ప్ర‌య‌త్నించార‌ని నాగ‌వంశీ తెలిపారు. ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి మీరు అనుకున్నంత బాలేదు. ఎక్కువ‌గా జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తేనే మేం మ‌రిన్ని మంచి సినిమాలు తీయ‌గ‌లం. హిందీలో `సైయారా`లా హిట్టు ప‌డాలి మ‌న‌కు. 31జూలై మీరు కింగ్ డ‌మ్ థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఊపు తెస్తార‌ని ఆశిస్తున్నాను. సినిమా రిలీజ్ ముందు ప్ర‌తిసారీ తిరుప‌తికి వ‌చ్చి వెంక‌టేశుని ఆశీస్సులు తీసుకుంటాను. నా కింగ్ డ‌మ్ పేరు తిరుప‌తి. ఇక్క‌డే ట్రైల‌ర్ లాంచ్ చేయాల‌ని విజ‌య్ నేను నిర్ణ‌యించుకున్నామ‌ని అన్నారు. ఈ క‌ర్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, భాగ్య‌శ్రీ, అనిరుధ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News