ఆ సినిమాలపై కింగ్ డమ్ ఎఫెక్ట్!

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-06-12 06:33 GMT

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో నిరాశపరిచిన ఆయన.. ఇప్పుడు కింగ్ డమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌ లో రూపొందుతున్న ఆ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న ఆ సినిమాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.. కింగ్ డమ్ వాయిదా పడింది. మే 30వ తేదీ నుంచి జులై 4కి వాయిదా వేశారు మేకర్స్. ఇప్పుడు ఆ తేదీకి యంగ్ హీరో నితిన్ తమ్ముడు మూవీతో రానున్నారు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.

దీంతో విజయ్ మూవీ మరోసారి వెనక్కి వెళ్లడం ఖాయమైనట్లే. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం వల్ల కింగ్ డమ్ లేట్ అవుతుందని తెలుస్తోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్ ఇంకా రీరికార్డింగ్‌ వర్క్‌ ను పూర్తి చేయలేదని సమాచారం. ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తారని టాక్.

అలా అనుకున్నట్లు జరిగితే.. జూలై 25వ తేదీన కింగ్ డిమ్ రిలీజ్ చేస్తారని వినికిడి. త్వరలో అధికారికంగా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారట. అయితే కింగ్ డమ్.. మేకర్స్ కొన్ని సీన్స్ ను రీషూట్ చేశారని కొద్ది రోజుల క్రితం టాక్ వినిపించింది. దీంతో విజయ్.. ఇంకా ఇప్పటి వరకు ఆ లుక్ లోనే ఉన్నారు.

దాని వల్ల ఆయన అప్ కమింగ్ సినిమాలపై ఎఫెక్ట్ పడినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ లైనప్ లో కింగ్ డమ్ కాకుండా.. రాహుల్ సాంకృత్యాన్, రవి కిరణ్ కోలాతో చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. ఏప్రిల్ లో కింగ్ డమ్ ను పూర్తి చేసిన విజయ్.. మే లో సాంకృత్యాన్ తీసే సినిమా సెట్స్ లో చేరాలని అనుకున్నారట.

కానీ కింగ్ డమ్ లుక్ ను మెయింటైన్ చేయడం వల్ల అది సాధ్యపడలేదు. దీంతో జూన్ కు వాయిదా వేశారని టాక్. ఇప్పుడు కింగ్ డమ్ తో పాటు రాహుల్ సాంకృత్యాన్ సినిమాలు లేట్ అవ్వడం వల్ల రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించే రౌడీ జనార్ధన్‌ కూడా ఆలస్యం కానుంది. మొత్తానికి కింగ్ డమ్ ఎఫెక్ట్.. విజయ్ రెండు సినిమాలపై పడిందని చెప్పాలి.

Tags:    

Similar News