కింగ్ డమ్ పరిస్థితి ఏంటి..?

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఫ్యాన్స్ ఆహా ఓహో అంటున్నా కామన్ ఆడియన్స్ మాత్రం సినిమాకు మిశ్రమ స్పందన ఇస్తున్నాడు.;

Update: 2025-08-04 06:40 GMT

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఫ్యాన్స్ ఆహా ఓహో అంటున్నా కామన్ ఆడియన్స్ మాత్రం సినిమాకు మిశ్రమ స్పందన ఇస్తున్నాడు. విజయ్ దేవరకొండ పరంగా సినిమాలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సూరీ పాత్రలో విజయ్ కసితో నటించాడు. అర్జున్ రెడ్డి సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో సూపర్ అనిపించిన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కోసం మరోసారి తన యాక్షన్ తో మెప్పించాడు. ఐతే సినిమా కథ, కథనాలు సరిగా కుదరకపోవడంతో ఈ టాక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కింగ్ డమ్ కలెక్షన్స్ లెక్కలు..

ఐతే కింగ్ డమ్ కలెక్షన్స్ లెక్కలుగా మేకర్స్ నుంచి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే పోస్టర్స్ వస్తున్నాయి. కలెక్షన్స్ రేంజ్ చూస్తే ఇదేదో బ్లాక్ బస్టర్ అనేలా ఉంది. కానీ ఆ సినిమా నిర్మాత నాగ వంశీనే ఆ కలెక్షన్స్ పోస్టర్స్ అన్నీ కూడా మానిపులేషనే అని అన్నాడు. ఫ్యాన్స్ శాటిస్ఫ్యాక్షన్ కోసం మాత్రమే పోస్టర్స్ అంటూ ఆయనే రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కు వేస్తున్న కలెక్షన్స్ పోస్టర్స్ కూడా అలాంటివేనా లేదా నిజంగానే అంత వస్తున్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

కింగ్ డమ్ సినిమా హిట్టా, ప్లాప్ అన్నది నిర్ధారణ కావాలంటే ఒరిజినల్ కలెక్షన్స్ బయటకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా.. వసూళ్లు ఎంత తెస్తుంది ఏంటి అన్నది అఫీషియల్ గా ఎవరికీ తెలియదు. వాళ్లు పోస్టర్స్ వేస్తే అదే నిజం అనుకునే పరిస్థితి ఉంది. జూలై 31 గురువారం రిలీజైన కింగ్ డమ్ సినిమా అసలైన పరీక్ష మండే అంటే ఈరోజు నుంచి ఉంటుంది.

సోమవారం రోజు నిలబడితేనే..

వీకెండ్ వరకు ఎలా ఉన్నా సోమవారం రోజు నిలబడితేనే సినిమా సక్సెస్ అయినట్టు. అంతేకాదు సినిమా హిట్టా, ఫ్లాపా అని తేల్చేది కూడా వీక్ డేస్ లోనే.. బ్రేక్ ఈవెన్ దగ్గర దాకా వచ్చి కలెక్షన్స్ ఆగినా కూడా అది ఫ్లాప్ అన్నట్టే లెక్క. మరి విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కలెక్షన్స్ లెక్క ఏంటో తెలియాలి.

ఐతే విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీస్ తో పోలిస్తే మాత్రం కింగ్ డం కాస్త బెటరే అని చెప్పొచ్చు. కానీ ఒక సినిమా సూపర్ హిట్ అయ్యేది కేవలం తొలిరోజు వచ్చే టాకే కాదు అది కలెక్ట్ చేసిన కలెక్షన్స్ బట్టి కూడా ఉంటుంది.

విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించిన కింగ్ డమ్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాలో విజయ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా తన అన్న పాత్రలో మరో యువ హీరో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు.

Tags:    

Similar News