VD కోసం దర్శకుడు భారీ ప్లాన్..?
నానితో శ్యామ్ సింగ రాయ్ తర్వాత ఈసారి అంతకుమించిన కథతో రావాలని విజయ్ కోసం అదిరిపోయే కథ రెడీ చేశాడట రాహుల్.;
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ రిలీజ్ కు రెడీ అవ్వగా నెక్స్ట్ రవికిరణ్ కోలాతో చేస్తున్న రౌడీ జనార్థన్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. రాయలసీమ కథతో ఈసారి మాస్ యాక్షన్ సినిమాతో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో సినిమా లైన్ లో పెట్టాడు విజయ్ దేవరకొండ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది.
రాహుల్ సంకృత్యన్, విజయ్ దేవరకొండ సినిమా 1854-78 కాలం మధ్య కథతో హిస్టారికల్ పీరియాడిక్ డ్రామాగా వస్తుంది. ఈమధ్యనే విజయ్ దేవరకొండ బర్త్ దే సందర్భంగా కూర్చున్న ఒక ఫోటో ప్రీ లుక్ ని వదిలారు మేకర్స్. ఐతే విజయ్ దేవరకొండ కోసం రాహుల్ చాలా పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కథ కథనాలు చాలా బాగా వచ్చాయట.
నానితో శ్యామ్ సింగ రాయ్ తర్వాత ఈసారి అంతకుమించిన కథతో రావాలని విజయ్ కోసం అదిరిపోయే కథ రెడీ చేశాడట రాహుల్. చరిత్ర కథను చెబుతూ కొంత ఫిక్షనల్ స్టోరీని పొందుపరుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్ కి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ పూర్తి స్టామినా ఏంటన్నది ఈ సినిమా ప్రూవ్ చేసేలా అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తున్నారట.
ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ రష్మిక జోడీ అంటే ఇక నెక్స్ట్ లెవెల్ అని తెలిసిందే. గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఐతే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదురుతుంది కాబట్టి ఈ సినిమా మిగతా అంశాలతో పాటు వీళ్ల జోడీ కూడా అదిరిపోతుందని చెప్పొచ్చు.
విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న 3 సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా ఉంది. తప్పకుండా విజయ్ ఫ్యాన్స్ కి ఈ సినిమాలు మంచి మాస్ ఫీస్ట్ అందించేలా ఉన్నాయి. రాహుల్ సంకృత్యన్ సినిమా అయితే ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అంతా సూపర్ అనిపించేలా చేస్తుందని అంటున్నారు. మరి విజయ్ దేవరకొండ కోసం రాహుల్ సంకృత్యన్ ఏం చేస్తాడో చూడాలి.