దేవరకొండ.. మరోసారి హిట్ కాంబో
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఇప్పటికే గీత గోవిందం సినిమా చేసిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఇప్పటికే గీత గోవిందం సినిమా చేసిన విషయం తెలిసిందే. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ.. భారీ విజయం సాధించింది. విజయ్ కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది. రష్మిక- విజయ్ కెమిస్ట్రీ, పరశురామ్ డైరక్షన్, గీతా ఆర్ట్స్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్.. సినిమాను హిట్ గా మార్చాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
అయితే గీత గోవిందం తర్వాత విజయ్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ కాంబినేషన్ లో మరో మూవీ రాలేదు. కానీ అది జరగాలని అటు విజయ్ అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే వారి కోరిక ఇప్పుడు తీరేలా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ కొత్త మూవీ తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది. ఆ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆయన రీసెంట్ గా రిలీజ్ చేసిన లిటిల్ హార్ట్స్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ వసూళ్లు సాధిస్తోంది. బడ్జెట్ కు అనేక రెట్ల లాభాలు సంపాదిస్తోంది. దీంతో మేకర్స్ తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ సహా పలువురు అటెండ్ అయ్యారు.
అయితే ఆ వేడుకలో అల్లు అరవింద్ సమక్షంలోనే నిర్మాత బన్నీ వాస్, విజయ్‌తో మరోసారి సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. "విజయ్ భాయ్.. తొందరలో గీత గోవిందం సినిమాకు మించి మూవీ తీద్దాం. అది ఎలాంటి హిట్ కొట్టాలి అంటే.. దాన్ని ముట్టుకోవాలంటే కెరీర్ లో చాలా టైమ్ పట్టాలి. అలాంటి హిట్ కొడదాం. అల్లు అరవింద్ గారికి, నాకు చాలా ఇష్టమైన హీరో విజయ్" అని బన్నీ వాసు తెలిపారు.
"అల్లు అరవింద్ గారు.. రోజూ నన్ను అడుగుతున్నారు.. ఏం ఆలోచిస్తున్నావని.. విజయ్ మూవీ గురించి అని.. ఎలా చేద్దాం ఏం చేద్దాం అని డిస్కస్ చేస్తున్నారు. కొట్టేది మాత్రం చాలా గట్టిగా కొడదాం.. నేను, అరవింద్ గారు నీ విషయంలో చాలా కసిగా ఉన్నాం. చాలా వెయిట్ చేస్తున్నాం. నీ కెరీర్ లో గీతా ఆర్ట్స్ నుంచి మరో హిట్ ఇస్తాం" అని హామీ ఇచ్చారు.
అయితే బన్నీ వాసు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు. ఈసారి విజయ్ ఇమేజ్ ను మరోస్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. మాస్ –ఫ్యామిలీ టచ్ ఉన్న కథతో మూవీ తీస్తారేమోనని గెస్ చేస్తున్నారు. మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని బన్నీ వాసు కామెంట్స్ ప్రకారం చెప్పొచ్చని అంటున్నారు.