విజయ్ 'కింగ్డమ్'.. హిందీ టైటిల్ ఇదే!
హిందీ డబ్బింగ్ వెర్షన్ ను నార్త్ అంతా AA Films పంపిణీ చేస్తోంది. తాజాగా మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.;
టాలీవుడ్ విజయ్ దేవరకొండ.. పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ తో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా స్పై జోనర్ లో జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఆ సినిమా.. జులై 31వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల అవ్వనుంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కింగ్డమ్ మూవీ.. మరో 13 రోజుల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
అయితే కింగ్డమ్ హిందీ వెర్షన్.. సామ్రాజ్య టైటిల్ తో నార్త్ లో రిలీజ్ అవ్వనుంది. ఈ మేరకు అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. హిందీ రిలీజ్ ను ఆదిత్య భాటియా, అతుల్ రజనీ సమర్పిస్తున్నారు. హిందీ డబ్బింగ్ వెర్షన్ ను నార్త్ అంతా AA Films పంపిణీ చేస్తోంది. తాజాగా మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
అందులో విజయ్.. వేరే లెవెల్ లో ఉన్నారు. చేతిలో ప్రత్యేక ఆయుధంతో నిల్చుని కనిపించారు. ఆ పోస్టర్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. వెయిటింగ్ ఫర్ మూవీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పోస్టర్ అదిరిపోయిందని అంతా చెబుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు.
అయితే రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో కింగ్డమ్ సత్తా చాటుతోంది. సినిమా విడుదలకు రెండు వారాల ముందుగానే అమెరికాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. 64 లొకేషన్స్ లో 135 షోస్ పడనున్నాయి. ఇప్పటికే 15 కే ( 13.63 లక్షల రూపాయల) టికెట్ సేల్స్ జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, సినిమా ట్రైలర్ ను త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ లైవ్ షో ఉండనున్నట్లు ఇప్పటికే నిర్మాత నాగవంశీ తెలిపారు. హీరోపై ఎలివేషన్స్ ఇచ్చే ఆ సాంగ్.. పక్కా అనిరుధ్ స్టైల్ లో ఉంటుందని చెప్పారు.