ఆయ‌న‌తో క‌చ్ఛితంగా సినిమా చేస్తా!

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ ముందు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ను స్టార్ చేసి ఆ త‌ర్వాత హీరోగా ఎదిగిన విష‌యం తెలిసిందే.;

Update: 2025-08-03 07:41 GMT

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ ముందు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ను స్టార్ చేసి ఆ త‌ర్వాత హీరోగా ఎదిగిన విష‌యం తెలిసిందే. పెళ్లి చూపులు అనే చిన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవ‌ర‌కొండ ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డితో సూప‌ర్ హిట్ ను అందుకోవ‌డంతో పాటూ మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అయితే గ‌త కొంత‌కాలంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఏ సినిమా చేసినా పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. కొన్ని సినిమాలుగా వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న విజ‌య్, రీసెంట్ గా కింగ్‌డ‌మ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. గ‌త సినిమాల‌తో పోలిస్తే విజ‌య్ కు కింగ్‌డ‌మ్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది మిక్స్డ్ టాక్ తో నడుస్తున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉండబోతుంది అనేది సోమవారం తరువాత తెలుస్తుంది . ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో విజ‌య్ త‌న త‌ర్వాతి సినిమాల గురించి మాట్లాడారు.

ఆంధ్ర‌, రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్ లో సినిమాలు

రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో తానో సినిమా చేస్తున్నాన‌ని, ఆ సినిమా కోసం రాయ‌ల‌సీమ యాస నేర్చుకుంటున్నాన‌ని చెప్పిన విజ‌య్, ర‌వికిర‌ణ్ కోలా తో మ‌రో సినిమా చేస్తున్నాన‌ని, ఆ సినిమా ఆంధ్రా నేప‌థ్యంలో ఉంటుంద‌ని తెలిపారు. దాంతో పాటూ సుకుమార్ తో సినిమా పై కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడారు.

సుకుమార్ కు నా వ‌ర్క్ అంటే ఇష్టం

అర్జున్ రెడ్డి సినిమా నుంచే తాను, సుకుమార్ క‌లిసి ఓ సినిమా చేయాల‌నుకున్నామ‌ని తెలిపారు విజ‌య్. సుకుమార్ గారికి త‌న వ‌ర్క్ అంటే ఇష్ట‌మ‌ని చెప్పిన విజ‌య్, ఫ్యూచ‌ర్ లో ఆయ‌న‌తో క‌లిసి క‌చ్ఛితంగా వ‌ర్క్ చేస్తాన‌ని,

ప్ర‌స్తుతం త‌న దృష్టంతా ఆల్రెడీ క‌మిట్ అయిన సినిమాల‌పైనే ఉంద‌ని, తానేం చేసినా ఆడియ‌న్స్ కు మంచి సినిమాను అందించ‌డ‌మే త‌న మెయిన్ టార్గెట్ అని చెప్పారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

Tags:    

Similar News