నా సామిరంగ డైరెక్ట‌ర్ ఏమైపోయాడు!

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించిన `నా సామీరంగ` సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-09-27 07:30 GMT

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించిన 'నా సామీరంగ' సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇదే సినిమాతో కొరియోగ్ర‌ఫ‌ర్ విజ‌య్ బిన్ని డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మ‌య్యాడు. తొలి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకోవ‌డంతో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. కానీ డైరెక్ట‌ర్ గా మాత్రం సెకెండ్ ఛాన్స్ రాలేదు. `నా సామి రంగ` రిలీజ్ అయి తొమ్మిది నెల‌లు గుడుస్తోంది. కానీ ఇంత వ‌ర‌కూ మ‌రో సినిమాకు సైన్ చేయ‌లేదు.

అగ్ర హీరోలంతా బిజీగా ఉన్నా? నాగార్జున లాంటి పెద్ద హీరోని డైరెక్ట్ చేసిన నేప‌థ్యంలో మీడియం రేంజ్ హీరోలు...టైర్ 2 హీరోల‌తోనైనా ప్రాజెక్ట్ సెట్ చేసుకోగ‌ల‌గాలి. కానీ విజ‌య్ బిన్నీ మాత్రం ఆ రేస్ లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ య‌ధావిధిగా డాన్సింగ్ షోలు చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఓ టీవీ షో ప్రోగ్రామ్ లో హోస్ట్ గా క‌నిపిస్తున్నాడు.

సినిమా హిట్ అయితే? మ‌రో సినిమాకు హీర్ ఛాన్స్ ఇవ్వ‌డం సంగ‌తి ప‌క్క‌న బెడితే నిర్మాత‌లైనా అడ్వాన్సులు ఇవ్వ‌డానికి అవ‌కాశం ఉంటుంది. కానీ విజ‌య్ విష‌యంలో ఆ స‌న్నివేశం కూడా క‌నిపించ‌లేదు. ఇప్పుడు కాక‌పోతే త‌ర్వాత ఎప్పుడైనా సినిమా చేయోచ్చు క‌దా? అన్న కోణంలో నిర్మాత‌లు ముందే లాక్ చేసి పెడుతుంటారు. కానీ విజ‌య్ కి అలాంటి అవ‌కాశాలు రాన‌ట్లే క‌నిపిస్తోంది. మ‌రి విజ‌య్ ఈ ఫేజ్ ని దాటి రెండ‌వ సినిమా అవ‌కాశం ఎలా అందుకుంటాడో చూడాలి. విజ‌య్ ప‌రిశ్ర‌మ‌కు డైరెక్ట‌ర్ అవ్వాల‌ని వ‌చ్చాడు.

కానీ ప‌రిశ్ర‌మ అత‌డిని మంచి కోరియోగ్రాఫ‌ర్ ని చేసింది. అదే ఇమేజ్ తో నాగార్జున‌కు ఓ రోజు స్టోరీ చెప్పాడు. కానీ ఆ స్టోరీ రిజెక్ట్ చేసి నాగార్జునే తాను ఇచ్చిన క‌థ‌ను డైరెక్ట్ చేయ‌మ‌ని సూచించారు. అదే నా సామి రంగ‌. అలా ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డం జ‌రిగింది. అయితే విజ‌య్ కు రైట‌ర్ గా గుర్తింపు లేక‌పోవ‌డంతో అవ‌కాశాలు రావ‌డం లేద‌న్న‌? సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. తాను కూడా ఏమంత సీరియ‌స్ గా ద‌ర్శ‌క‌త్వ ప్ర‌య‌త్నాల్లోనూ క‌నిపించ‌డం లేదు అన్న చ‌ర్చ ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతోంది. నిరంత‌రం అదే ప‌నిగా ప్ర‌య‌త్నాలు చేస్తే త‌ప్ప ఇక్క‌డ అవ‌కాశాలు రావు అన్న‌ది అంతే వాస్త‌వం.

Tags:    

Similar News