వడ చెన్నై యూనివర్స్.. శింబు 'సామ్రాజ్యం' మాటల్లేవ్ అంతే..!

కోలీవుడ్ లో తన మార్క్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ కు ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్న వెట్రి మారన్ తన కొత్త సినిమా టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు.;

Update: 2025-10-17 06:30 GMT

కోలీవుడ్ లో తన మార్క్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ కు ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్న వెట్రి మారన్ తన కొత్త సినిమా టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు. శింబు హీరోగా వెట్రిమారన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా అరసన్ తెలుగులో సామ్రాజ్యం అని ఫిక్స్ చేశారు. సినిమా కాన్సెప్ట్ ని రివీల్ చేస్తూ వదిలిన వీడియో నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది. టీజర్ గా ఎవరైనా నిమిషం లేదా 2 నిమిషాలు వదులుతారు. కానీ వెట్రిమారన్ సామ్రాజ్యం 5 నిమిషాల వీడియోతో వచ్చారు.

శింబు యాక్టింగ్.. వెట్రిమారన్ టేకింగ్..

ఈ 5 నిమిషాల్లోనే శింబు రెండు వేరియేషన్స్ లో కనిపించడం.. అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ వడ చెన్నై అంటూ ఈ సినిమాను వడ చెన్నై యూనివర్స్ లో భాగం చేయడం.. శింబు యాక్టింగ్.. వెట్రిమారన్ టేకింగ్ తో పాటు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ తోడై సామ్రాజ్యం సౌండ్ గట్టిగానే ఉండేలా అనిపిస్తుంది. వెట్రిమారన్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అతని సినిమాలు ఎప్పుడు ఒక సోషల్ కాజ్ తో వస్తాయి. ఐతే దానిలో తన వైలెన్స్ స్టైల్ తో సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాడు.

ఇక ఈ సినిమాలో శింబు డిస్ క్లైమర్ చెబుతూ ఎన్ టీ ఆర్ కి ఈ కథ బాగుంటుందని చెప్పడం తెలుగు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. కొన్నాళ్లుగా శింబు కెరీర్ లో కాస్త వెనకపడగా అరసన్ అదే సామ్రాజ్యం టీజర్ తోనే పిచ్చెక్కించేశాడు. శింబుకి పర్ఫెక్ట్ బొమ్మగా ఈ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమాలో ధనుష్ క్యామియో కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే వడ చెన్నై యూనివర్స్ అంటే అందులో ధనుష్ ఉండాల్సిందే.

ఫైవ్ మినిట్స్ ప్రోమోతో ఆడియన్స్ లో..

వెట్రిమారన్ సామ్రాజ్యం ఇంటెన్స్ మూవీగా రాబోతుంది. సినిమా నుంచి వచ్చిన ఈ ఫైవ్ మినిట్స్ ప్రోమోతో ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచారు వెట్రిమారన్. సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ తప్పకుండా ఒక రేంజ్ లో ఇంపాక్ట్ చూపించేలా ఉంది. ఈ సినిమాను వి సినిమాస్ బ్యానర్ లో కళైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ శింబు మానాడు సినిమాతో సక్సెస్ అందుకున్నా ఆ తర్వాత మళ్లీ ఆయన రేంజ్ సినిమా పడలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక సామ్రాజ్యం టీజర్ చూసి ఇది కదా సినిమా అంటే అనుకుంటున్నారు. శింబు ఫ్యాన్స్ అయితే ఈ మూవీ టీజర్ చూసే సాటిస్ఫైడ్ అనేస్తున్నారు. ఇక మొత్తం సినిమా ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందో చూడాలి.

వైలెన్స్ ఉన్నా కూడా వెట్రిమారన్ చెప్పే కథ, ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అవుతాయి. అందుకే ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వెట్రిమారన్ మార్క్ మూవీగా వస్తున్న ఈ సామ్రాజ్యం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Full View
Tags:    

Similar News