వెంకీ ఆడుతున్న బాక్సాఫీస్ గేమ్!
'సార్' సినిమాలో ధనుష్, 'లక్కీ భాస్కర్' లో దుల్కర్ సల్మాన్, ఇప్పుడు ఏకంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' లో సూర్య. వరుసగా ఈ మూడు సినిమాల్లోనూ మన స్ట్రెయిట్ తెలుగు హీరో లేడు.
'సార్' సినిమాలో ధనుష్, 'లక్కీ భాస్కర్' లో దుల్కర్ సల్మాన్, ఇప్పుడు ఏకంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' లో సూర్య. వరుసగా ఈ మూడు సినిమాల్లోనూ మన స్ట్రెయిట్ తెలుగు హీరో లేడు. కానీ ఈ మూడు సినిమాలు పక్కాగా మన తెలుగు మార్కెట్ ను టార్గెట్ చేస్తూనే వచ్చాయి. మొదటి రెండు మంచి హిట్లు కాగా, లేటెస్ట్ మూవీ కూడా థియేటర్లలో సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీంతో వెంకీకి తెలియకుండానే ఒక కొత్త సక్సెస్ రూట్ సెట్ అయిపోయింది.
ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. ధనుష్, దుల్కర్, సూర్య ముగ్గురూ మన తెలుగు ఆడియన్స్ కు బాగా తెలిసిన వాళ్లే. కానీ మన స్ట్రెయిట్ స్టార్ హీరోలకు ఉండే ఇమేజ్, కమర్షియల్ లెక్కల భారం వీళ్ల మీద ఉండదు. అందుకే వెంకీ తన కథకు తగ్గట్టుగా హీరో క్యారెక్టరైజేషన్ ను మార్చుకునే ఫ్రీడమ్ ఎక్కువగా దొరుకుతోంది. 'సార్' లో ఒక మామూలు టీచర్ లా, 'లక్కీ భాస్కర్' లో మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయ్ లా.. స్టార్ డమ్ కంటే కథలోని పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సక్సెస్ అయ్యాడు.
నిజానికి 'సార్' సినిమా కథను ముందుగా మాస్ మహారాజా రవితేజతో చేయాలని అనుకున్నట్టు వెంకీనే స్వయంగా చెప్పాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఫైనల్ గా ధనుష్ దగ్గరకు వెళ్లింది. కట్ చేస్తే అక్కడి నుంచి వెంకీ కెరీర్ రూట్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత దుల్కర్ తో చేసిన 'లక్కీ భాస్కర్' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. ఇప్పుడు సూర్యతో చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా అదే ట్రాక్ లో దూసుకుపోతోంది. ముందే ప్లాన్ చేసుకోకపోయినా, ఈ ఫార్ములా మాత్రం వెంకీకి భలేగా వర్కవుట్ అయింది.
ఇలా పరభాషా హీరోలతో సినిమాలు చేయడం వల్ల మార్కెట్ పరంగా పెద్ద ప్లస్ అవుతోంది. మన హీరోతో చేస్తే కేవలం తెలుగు మార్కెట్ వరకే మెయిన్ ఫోకస్ ఉంటుంది. అదే ధనుష్ తో చేయడం వల్ల తమిళ మార్కెట్, దుల్కర్ తో మలయాళ మార్కెట్ ప్లస్ అయ్యాయి. ఇక సూర్యకు తమిళంతో పాటు ఇక్కడ కూడా దశాబ్దాలుగా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. పాన్ ఇండియా అని డబ్బా కొట్టుకోకుండానే, హీరోల సెలక్షన్ తోనే వెంకీ రెండు మూడు ఇండస్ట్రీల మార్కెట్లకు ఈజీగా డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు.
ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' కలెక్షన్స్ ఈ అడ్వాంటేజ్ నే క్లియర్ గా చూపిస్తున్నాయి. ఒక పక్క తమిళంలో అదరగొడుతూనే, తెలుగు వెర్షన్ కు కూడా గట్టిగానే వసూళ్లు రాబడుతోంది. కథలో దమ్ముంటే మన ఆడియన్స్ ఏ హీరోనైనా ఓన్ చేసుకుంటారు అనడానికి ఈ సినిమా రెస్పాన్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా, స్టోరీకి ఎవరు సెట్ అవుతారో వాళ్లను పట్టుకోవడం వెంకీకి బాగా కలిసొచ్చింది. అందుకే వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోందన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ గా మారింది. మళ్లీ మన తెలుగు స్టార్ దగ్గరకు వస్తాడా, లేక ఇదే రూట్ లో కంటిన్యూ అవుతూ ఇంకో సౌత్ హీరోను సెట్ చేసుకుంటాడా అనేది చూడాలి. .