పాలిటిక్స్ లో దుమ్ము లేపుతున్న వెంకీమామ

ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత.. కొన్నేళ్లకు తన పేరుకు విజయాన్ని జోడించి విక్టరీ వెంకటేష్ గా మారిపోయారు.

Update: 2024-05-10 05:54 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ కు ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన యాక్టింగ్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించారు. తెలుగులో టాప్ హీరోగా ఎదిగారు. ఫ్యామిలీ చిత్రాలతో మహిళలకు దగ్గరయ్యారు.

ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత.. కొన్నేళ్లకు తన పేరుకు విజయాన్ని జోడించి విక్టరీ వెంకటేష్ గా మారిపోయారు. అయితే వెంకీ మామకు సౌమ్యుడిగా మంచి పేరు ఉంది. ఎలాంటి వివాదాలు, కాంట్రవర్సీలు లేకుండా కెరీర్‌ లో ఎదిగారు. ముఖ్యంగా రాజకీయాలకు డిస్టెన్స్ తో ఉండేవారు. ఎప్పుడూ రాజకీయ పార్టీలకు ప్రచారం కూడా చేయలేదు. అలాంటి వెంకీ.. ఈ సారి ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

తొలుత తన వియ్యంకుడిని గెలిపించేందుకు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో తన వియ్యంకుడు రఘరాంరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడికి ఇచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే. ఆమె కూడా తన మామ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రఘరాంరెడ్డిని గెలిపించాలని ఇంటింటికి వెళ్తూ ఓటర్లను కోరుతున్నారు ఆశ్రిత.

అయితే వెంకటేష్.. తన వియ్యంకుడు కోసం ప్రచారం నిర్వహించాక.. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి (బీజేపీ) అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ప్రచారం చేశారు. కలిదిండి మండలంలోని పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ జంక్షన్ వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస్ మావయ్యను గెలిపించాలని ప్రజలను కోరారు

Read more!

అంతే కాదు రోడ్ షోలో తన ప్రసంగంతో ఉర్రూతలూగించారు వెంకీ. ఏంటీ ప్రేమ, ఏంటీ ఉత్సాహం, అక్కా, చెల్లి అంటూ సందడి చేశారు. మంచితనానికి మారుపేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాసరావు అని తెలిపారు. భవిష్యత్తు బాగుండాలంటే ఓటు వేయాలని కోరారు. మే 13 గుర్తు పెట్టుకోండని చెప్పారు. వెంకీ మామగా.. పెళ్లికాని ప్రసాద్‌ గా అడుగుతున్నా శ్రీనివాస్‌ మామను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వెంకటేష్.

అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంట్రవర్సీ, పాలిటిక్స్ కు దూరంగా ఉండే వెంకటేష్.. ఫస్ట్ టైమ్ ఇలా మాట్లాడడం షాకింగ్ గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఇప్పటివరకు నెగిటివ్ ఫ్యాన్స్ లేకుండా వచ్చిన వెంకీ మామకు ఇకపై యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారేమోనని అని అంటున్నారు. ఏదేమైనా పాలిటిక్స్ లో వెంకటేష్ దుమ్ము లేపుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. మరి వెంకీ మామ ప్రచారం.. ఆయా అభ్యర్థులకు ఎంత వరకు పనికొస్తుందో తెలియాలంటే జూన్ 4న తేదీ వరకు వేచి చూడాలి.

4
Tags:    

Similar News