వెంకీ కోసం త్రివిక్రమ్ మాస్ట‌ర్ ప్లాన్!

విక్టరీ వెంకటేశ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ ఆదర్శకుటుంబం సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.;

Update: 2026-04-13 23:30 GMT

విక్టరీ వెంకటేశ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ ఆదర్శకుటుంబం సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా వినిపిస్తున్న స్పెషల్ సాంగ్ అప్డేట్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆస‌క్తిని పెంచుతోంది. ఈ సాంగ్ లో వెంకటేశ్‌తో కలిసి కనిపించబోయే బ్యూటీ ఎవర‌న్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం ఐటమ్ సాంగ్‌గా ఉంటుందా, లేక కథలో కీలకమైన మలుపుకు కారణమవుతుందా అన్న దానిపై కూడా చర్చ నడుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో సాంగ్స్ సాధారణంగా స్టోరీకి కనెక్ట్ అయి ఉండటం, ఎమోష‌న్స్‌ను మరింత బలపరచడం తెలిసిందే. దీంతో ఈ సాంగ్ కూడా కథలో ప్రత్యేక ప్రాధాన్యం పొందే అవకాశముంది.

వెంకీ క్లాసిక్ సినిమాల‌కు రైట‌ర్ గా..

ఇక వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి క్లాసిక్ హిట్స్‌కు త్రివిక్రమ్ రచయితగా పనిచేయగా, ఇప్పుడు ఆయ‌న డైరెక్ట‌ర్ గా వ‌స్తోన్న ఈ సినిమాతో ఎలాంటి ట్రీట్ ఇవ్వ‌నున్నారో చూడ్డానికి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ, ఎమోషన్‌తో పాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ను సమపాళ్లలో అందించాలన్న టార్గెట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో నారా రోహిత్

కథ పరంగా ఇది కుటుంబ విలువలపై దృష్టి పెట్టిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్టు సమాచారం. స్పెషల్ సాంగ్, నారా రోహిత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ చేయ‌డం లాంటి అంశాలు ఈ సినిమాను మాస్ ప్రేక్షకులకు కూడా దగ్గర చేయనున్నాయి. ఈ రెండు అంశాల మధ్య బ్యాలెన్స్ ఎలా సాధిస్తారన్నదే సినిమాను స‌క్సెస్‌ను నిర్ణయించే కీలక అంశంగా మారనుంది.

ఈ సినిమా క్వాలిటీ విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడడం లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. స్క్రిప్ట్ నుంచి డైలాగ్స్ వరకు ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతూ, క్లాస్ మరియు మాస్ ఆడియ‌న్స్ ను ఆకట్టుకునేలా హై స్టాండర్డ్స్‌ను మెయింటైన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. సినిమాను అనుకున్న టైమ్ కు పూర్తి చేసి స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్లకు వచ్చే ఈ సీజన్‌లో రిలీజ్ చేయడం ద్వారా కలెక్షన్స్‌ను గరిష్ట స్థాయికి తీసుకెళ్లాలన్న ప్లాన్ కనిపిస్తోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్‌తో కలిసి పలువురు సక్సెస్‌ఫుల్ సినిమాలు నిర్మించిన ఈ బ్యానర్, ఈసారి కూడా గ్రాండ్ స్కేల్‌లో మూవీని రూపొందిస్తోంది. షూటింగ్ పూర్తికాకముందే స్పెషల్ సాంగ్ లాంటి ఎలిమెంట్స్‌తో హైప్ క్రియేట్ చేయడం, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కంటెంట్‌ను ప్లాన్ చేయడం కూడా మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తోంది. అయితే, అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలను పెంచిన ఈ సినిమా ఎంతవరకు వాటిని నెరవేర్చగలదన్నది చూడాలి.

Tags:    

Similar News