వెంకీ-గురూజీ డేట్ లాక్డ్!
ఇప్పటికే పూజా కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.;
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమాతో వెంకీ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చిన సక్సెస్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తున్న వెంకీ, ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
త్రివిక్రమ్ తో వెంకీ మూవీ
అందులో భాగంగానే వెంకీ, తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. గతంలో వెంకీ, త్రివిక్రమ్ కలయికలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు వచ్చాయి.
సూపర్ హిట్ కాంబినేషన్ గా వెంకీ- త్రివిక్రమ్ కాంబో
ఆ రెండు సినిమాలూ సూపర్‌హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఆ సినిమాలకు వర్క్ చేసింది నిజమే కానీ అది డైరెక్టర్ గా కాదు. రైటర్ గా మాత్రమే. త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక మాత్రం ఇప్పటివరకు వెంకీతో కలిసి సినిమా చేసింది లేదు. మళ్లీ ఇన్నేళ్లకు వారి కాంబినేషన్ లో సినిమా రానుండటం, దానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనుండటంతో ఈ ప్రాజెక్టుపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
వెంకీ77 లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..
వెంకీ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ అప్డేట్ వినిపిస్తోంది. వెంకీ77 అక్టోబర్ 6 నుంచి సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని, మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుందని సమాచారం. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుండగా, ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించే అవకాశముందని ఇన్‌సైడ్ టాక్. అయితే హీరోయిన్ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.