అనుమానాలు పెంచుతున్న త్రివిక్రమ్ -వెంకీ మూవీ రూమర్డ్ టైటిల్.. గురూజీ ప్లాన్ ఏంటి?

కానీ ఇప్పుడు తాజాగా 'అబ్బాయిగారు 60 ప్లస్' అనే టైటిల్ తెరపైకి వచ్చింది.;

Update: 2025-10-12 06:17 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న వెంకటేష్ చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో 20 నిమిషాల పాటు క్యామియో రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అటు త్రివిక్రమ్ విషయానికి వస్తే.. చివరిగా మహేష్ బాబుతో 'గుంటూరు కారం' సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ డైరెక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగానే హోమ్లీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వెంకటేష్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు త్రివిక్రమ్. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉండగా గతంలో వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు డైలాగులు రాసిన త్రివిక్రమ్.. ఇప్పుడు డైరెక్టర్ గా వెంకటేష్ తో తొలి సినిమా చేస్తున్నారు. అందుకే తమ హీరోని డైరెక్టర్ గా త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే ఆసక్తి అభిమానులలో కూడా పెరిగిపోయింది.

ఇదిలా ఉండగా మరొకవైపు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు సంబంధించి టైటిల్ విషయంలో పలు రకాల పేర్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదట 'ఆనందరావు' అంటూ ఒక టైటిల్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 'ఆనంద నిలయం' అంటూ కూడా కామెంట్లు చేశారు. అయితే ఈ రెండు టైటిల్స్ కూడా హోమ్లీగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా 'అబ్బాయిగారు 60 ప్లస్' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో అభిమానులలో సరికొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అబ్బాయిగారు 60 ప్లస్ అంటే ఇందులో హీరో వయసు 60 సంవత్సరాలు దాటిపోయిందని చూపిస్తున్నారని, ఒకవేళ ఇదే నిజమైతే ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాలాగే ఇందులో హుషారైన పాటలు డ్యూయెట్లు కష్టం అని చెప్పాలి. ఒకవేళ త్రివిక్రమ్ ఇందులో డ్యూయల్ రోల్ ప్లాన్ చేస్తూ ఉంటే.. తండ్రి కొడుకుల పాత్రలో వెంకటేష్ ను నటింపజేసి ఒకరితో డ్యూయెట్ , హుషారైన పాటలు పెట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు అంటే డ్యూయెట్స్ తప్పనిసరి..పైగా స్పెషల్ సాంగ్స్ కచ్చితంగా ఉంటాయి. మరి ఇలాంటి సమయంలో వెంకటేష్ సినిమాకి అలాంటి టైటిల్ పెట్టడం వెనుక అర్థం ఏమిటి? అసలు గురూజీ ఏం ప్లాన్ చేస్తున్నాడు.? అంటూ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలి అంటే వెంకటేష్ , త్రివిక్రమ్ స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

ఇకపోతే ఇక్కడ గురూజీ మాస్టర్ ప్లాన్ మరొకటి కూడా ఉందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా సక్సెస్ అవ్వాలి అంటే.. త్రివిక్రమ్ వెంకటేష్ తో చేస్తున్న సినిమా పాన్ ఇండియాగా మార్కెట్ తెచ్చుకోవాలి. అలా పాన్ ఇండియా వైడ్ మార్కెట్ పెరిగితే త్రివిక్రమ్ బ్రాండ్ పెరుగుతుంది. తద్వారా ఎన్టీఆర్ తో చేయబోయే మూవీకి మరింత క్రేజ్ లభిస్తుంది. అందుకే త్రివిక్రమ్ ఏం చేసినా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సినిమా చేయాలని.. ఆ సినిమాకి తగ్గట్టుగా టైటిల్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కూడా సలహాలు ఇస్తున్నారు. మరి గురూజీ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలియాలి అంటే టైటిల్ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Tags:    

Similar News