బీచ్ ఒడ్డున గ్లామర్ తో ఆకట్టుకుంటున్న వేదిక!

నటి వేదిక ఎప్పుడు తన బోల్డ్ అందాలతో ఫాలోవర్స్ ని ఆకట్టుకునే పనిలోనే ఉంటుంది. అలా తాజాగా వేదిక సముద్రం వ్యూతో ఉన్న అందాలతో కుర్రకారుకి వలవేస్తోంది.;

Update: 2025-11-01 18:30 GMT

నటి వేదిక ఎప్పుడు తన బోల్డ్ అందాలతో ఫాలోవర్స్ ని ఆకట్టుకునే పనిలోనే ఉంటుంది. అలా తాజాగా వేదిక సముద్రం వ్యూతో ఉన్న అందాలతో కుర్రకారుకి వలవేస్తోంది. ఈ మధ్యకాలంలో వేదిక ఎక్కువగా వెకేషన్ లోనే సందడి చేస్తోంది.రీసెంట్ గా వేదిక ఇన్స్టా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ఎక్కువగా సముద్రం, బీచ్ ఫోటోలే కనిపిస్తున్నాయి. తాజాగా వేదిక ఏజియన్ సముద్రం ఒడ్డున కూర్చున్న ఓ బికినీ ఫోటోని షేర్ చేసుకుంది. వైట్ కలర్ డ్రెస్ లో వేదిక తన అందాలతో కుర్రకారుకి గత్తర లేపుతోంది. ప్రస్తుతం వేదిక తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ ఒక్క ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.




ఈ ఫోటోలో వేదిక ఆత్మవిశ్వాసం ఆమె ఫిట్నెస్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అలా తాజాగా సముద్రం ఒడ్డున కూర్చున్న వేదిక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోకి క్యాప్షన్ గా "సూర్యుడు నా ఏకైక ఫిల్టర్" అని రాసుకొచ్చింది.. ప్రస్తుతం వేదిక గ్రీక్ వెకేషన్ లో ఉన్నట్టు అర్థమవుతుంది. రీసెంట్ గానే ఆమె మాల్దీవులకి వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను పంచుకుంది. తాజాగా గ్రీక్ వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అలా సమయం దొరికితే చాలు వెకేషన్ లకు చెక్కేస్తూ అక్కడ వివిధ ప్రాంతాల్లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.అలాంటి వేదిక తాజా ఫోటో క్షణాల్లో వైరల్ అవ్వడంతో పాటు ఆమె అందానికి చాలామంది అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

వేదిక సినిమాలు, పర్సనల్ విషయానికి వస్తే.. మహారాష్ట్రకు చెందిన వేదిక లండన్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఎం.ఎస్.సి పూర్తి చేసి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా మొదట వేదిక కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక వీడియో ఆల్బమ్ చేసింది. ఆ ఆల్బమ్ ద్వారా వేదికకి తమిళ సినిమాలో ఆఫర్ వచ్చింది. అలా తమిళంలో మద్రాసి,ముని సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది.ముఖ్యంగా రాఘవా లారెన్స్ నటించిన ముని మూవీకి తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది.

తమిళ,కన్నడ,మలయాళ, తెలుగు భాషల్లో రాణిస్తున్న వేదిక టాలీవుడ్లో ముని, విజయదశమి,దగ్గరగా దూరంగా,బాణం, రూలర్, ఫియర్,రజాకర్ వంటి సినిమాల్లో నటించింది. అలాగే ఈమె తమిళంలో నటించే చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. ఈ ఏడాది వేదిక గణా అనే కన్నడ మూవీ తో పాటు గజానా అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. టాలీవుడ్ లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన జంగిల్ అనే మూవీలో కూడా వేదిక నటించింది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో వేదిక నటించిన వినోదన్ మూవీ కూడా షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News