బికినీ బీచ్‌లో దుమ్ము రేపుతున్న నారా రోహిత్ హీరోయిన్

సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వేదిక ప్రస్తుతం సోషల్ మీడియాల‌లో గ్లామర్ బాణాలు విసురుతూ దుమారం రేపుతోంది.

Update: 2026-05-31 13:09 GMT

సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వేదిక ప్రస్తుతం సోషల్ మీడియాల‌లో గ్లామర్ బాణాలు విసురుతూ దుమారం రేపుతోంది. టాలీవుడ్ హీరో నారా రోహిత్ సరసన `బాణం` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన తొలి అడుగుతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత వరుసగా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారింది. ముఖ్యంగా కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ కాంబినేషన్‌లో వచ్చిన హర్రర్ హిట్ `కాంచన 2` (ముని 3) చిత్రంలో త‌న న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే కాంచన వంటి భారీ విజయం తర్వాత వేదికకు టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. సినిమా ఛాన్సులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో ఈ బ్యూటీ తన రూటు మార్చింది. వెండితెరపై కాస్త సాంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ సుందరి ఇటీవల సోషల్ మీడియా వేదికలపై టూమ‌చ్‌గా రెచ్చిపోతూ బోల్డ్ దుస్తుల‌లో ఎక్స్‌*పో**గ్‌తో నెటిజన్లకు షాక్ ఇస్తోంది. తన పర్ఫెక్ట్ ఫిగర్‌ను ప్రదర్శిస్తూ బికినీలు, రంగురంగుల స్విమ్‌సూట్లలో దిగిన ఫోటోలను నిరంతరం షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో సెగలు పుట్టిస్తోంది.

తాజాగా వేదిక తన ఇన్‌స్టా లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రపంచ విఖ్యాత‌ పర్యాటక ప్రాంతమైన ఫ్రెంచ్ రివేరాలోని మోంటే కార్లో- కోట్ డి అజూర్ బీచ్‌లో టూపీస్ బికినీ లుక్‌లో దర్శనమిచ్చింది. సూర్యకాంతి తన శరీరాన్ని తాకుతుండగా చల్లటి సముద్రపు నీటిలోకి అడుగుపెట్టానని ఇప్పుడు మునుపటికంటే ఎంతో తేలికగా రిలాక్స్‌డ్‌గా ఫీలవుతున్నానంటూ వేదిక‌ ఈ ఫోటోలకు ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా జోడించింది.

బీచ్ గ‌ట్టున‌ వేదిక గ్లామర్ ఫోటోషూట్ చూసి నెటిజన్లు, అభిమానులు క్రేజీ కామెంట్లతో విరుచుకుప‌డుతున్నారు. క్యూట్ ప్లస్ క్లాసీ కలయికకు నువ్వే నిదర్శనం..బీచ్‌లో ఒక దేవతలా ఉన్నావు, నీ స్టైల్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది! అంటూ నెటిజన్లు లైకులు, హార్ట్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గినా సోషల్ మీడియా పవర్ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలో ఏ విధంగా లైమ్‌లైట్‌లో కొనసాగవచ్చో వేదిక తన హాట్ ఫోటోషూట్లతో నిరూపిస్తోంది.




Tags:    

Similar News