వరుణ్ తేజ్ లైనప్.. ఆశలన్నీ ఈ రెండు సినిమాలపైనే..

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ, అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది.;

Update: 2025-08-27 06:18 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు మంచి సాలిడ్ హిట్ అవసరం ఉంది. ఆయన గత కొన్నేళ్లుగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. మట్కా, గాంఢీవదారి అర్జున, ఆపరేషన్ వాలెటైంన్ ఇలా సినిమాలన్నీ ఆనుకున్న రీతిలో ఫలితం దక్కించుకోలేకపోయి. ఈ సినిమాల ప్రొడ్యూసర్లు సైతం భారీ మొత్తంలోనే లాస్ అయ్యారు. దీంతో వరుణ్ మార్కెట్ కూడా పడిపోయింది.

ఇక ప్రస్తుతం వరుణ్ ఆశలన్నీ మేర్లపాక గాంధీ సినిమాపైనే ఉన్నాయి. లవ్ హార్రర్, కామెడీ జానర్ లో ఇది తెరకెక్కుతుంది. ఇదొక కొరియన్ డ్రామా. ఈ సినిమా కొరియన్ కనకరాజుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గాంధీ మేర్లపాక దర్శకత్వంపై ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ, అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా మరో సినిమాకు కూడా వరుణ్ సంతకం చేశాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు టైటిల్ ఖరారు కాలేదు. సినిమా కూడా మొదలు అవ్వలేదు.

ఇది ఒక ప్రేమ కథగా తెరకెక్కనుందని అంటున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ ను మేకర్స్ హోల్డ్‌ లో ఉంచారు. కానీ రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం దసరా పండగ తర్వాత పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఫార్మాలిటీలు ప్రారంభం అవుతాయి. భారీ నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ నిర్మించనున్నారు.

త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కులగా అమెరికాలో జరగనుంది. ఇది వరుణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలు ఎదురవుతున్న వరుణ్ కు ఈ రెండు సినిమాల విజయాలు కెరీర్ కు బూస్ట్ ఇవ్వనున్నాయి.

Tags:    

Similar News