బిడ్డ‌ను వ‌దిలి వెళ్లాకా అవే జ్ఞాప‌కాలు.. లావ‌ణ్య త్రిపాఠి అంత‌ర్మ‌థ‌నం!

భారతీయ సినీ పరిశ్రమంలో అత్యంత జనాదరణ పొందిన జంటలలో వరుణ్ తేజ్‍‍ - లావ‌ణ్య త్రిపాఠి కూడా ఉన్నారు.

Update: 2026-08-30 04:31 GMT

భారతీయ సినీ పరిశ్రమంలో అత్యంత జనాదరణ పొందిన జంటలలో వరుణ్ తేజ్‍‍ - లావ‌ణ్య త్రిపాఠి కూడా ఉన్నారు. ‍‍ సామాజిక మాధ్య‌మాల‌లోను ఈ జోడీ ఎంతో యాక్టివ్ గా అభిమానుల‌కు క‌నెక్ట్ అయి ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో లావ‌ణ్య షేర్ చేసిన‌ ఒక పోస్ట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తమ బిడ్డ జన్మించిన తర్వాత మొదటిసారిగా బాబు లేకుండా బయటకు వెళ్లిన సందర్భాన్ని లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ``పాప లేకుండా బయటకు వచ్చాం... కానీ ఇప్పటికీ మా మాట‌లన్నీ పాప గురించే నడుస్తున్నాయి`` అంటూ త‌ను పెట్టిన క్యాప్షన్ కొత్త‌గా త‌ల్లిదండ్రులైన ప్ర‌తి ఒక్క‌రి మనసును తాకింది.




 


ఈ చిన్న క్యాప్షన్ వెనుక ఉన్న అర్థం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి కొత్త తల్లిదండ్రులకు చాలా బాగా అర్థమవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత దంపతులు తమకంటూ కొంత సమయం కేటాయించుకోవాలని.. ఒకరితో ఒకరు సమయం గడపాలని బయటకు వెళ్తారు. అయితే ఎంత ప్రయత్నించినా వారి ఆలోచనలు, సంభాషణలు మాత్రం ఇంట్లో ఉన్న బిడ్డ చుట్టూనే తిరుగుతుంటాయి. పిల్లల పెంపకం అనేది ఒక వ్యక్తి జీవితంలో తీసుకొచ్చే మైండ్ సెట్ మార్పుకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.




 


లావణ్య షేర్ చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. అన్నా కొణిదెలతో పాటు భర్త వరుణ్ తేజ్ స్వయంగా హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమను వ్యక్తం చేశారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, వైద్యులు, స్నేహితులు ``ఇదే పేరెంట్‌హుడ్ మ్యాజిక్`` అంటూ కామెంట్లు చేశారు. శరీరం మాత్రమే బయట ఉంటుంది తప్ప... మనసంతా ఇంట్లో ఉన్న బిడ్డ దగ్గరే ఉండిపోతుందని చాలా మంది నెటిజన్లు లావణ్య అభిప్రాయంతో ఏకీభవించారు.

ఈ ఘటనతో పాటు అభిమానులు వీరి జంటను #VarunLav అని పిలుస్తూ ప్రేమ వర్షం కురిపించారు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా ఈ ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ పోస్ట్ మరోసారి నిరూపించింది. ఎంత ఎత్తుకు ఎదిగినా.., సెలబ్రిటీ హోదా ఉన్నా... ఒక తల్లిగా, తండ్రిగా పడే తపన - సంతోషం అందరికీ ఒకేలా ఉంటాయని వీరిని చూస్తే అర్థమవుతుంది.

మొత్తానికి లావణ్య త్రిపాఠి షేర్ చేసిన‌ ఈ మధురమైన క్షణం కేవలం ఒక పోస్ట్ మాత్రమే కాకుండా.. పేరెంట్‌హుడ్‌లో ఉండే అందమైన అనుభూతిని అందరికీ గుర్తుచేసింది. ఎంత బిజీ లైఫ్ ఉన్నా.. పిల్లల విష‌యంలో తల్లిదండ్రులు చూపించే ఈ ప్రేమ-బాధ్యతే వారి బంధాన్ని మరింత బలపరుస్తుందని ఈ జంట చాటిచెప్పింది.

నటుడు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట వివాహం తర్వాత కూడా తమ నటనను కొనసాగిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన వరుణ్ తేజ్ తాజా చిత్రం `కొరియ‌న్ క‌న‌క‌రాజు` బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో గ్రాండ్ సక్సెస్‌ను సాధించింది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని పెద్దనాన్న, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా విచ్చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలను సెలబ్రేట్ చేయడం విశేషం. విజ‌యంతో వ‌చ్చే ఆనందం ఎలా ఉన్నా, బిడ్డ ఎదుగుతుంటే క‌లిగే ఆనంద‌మే వేరు. ప్ర‌స్తుతం ఆ త‌న్మ‌యంలోనే ఉన్నారు ఈ అంద‌మైన జంట‌. లావ‌ణ్య - వ‌రుణ్ దంప‌తులు త‌మ వార‌సుడికి వాయువ్య్ తేజ్ కొణిదెల అనే ఆసక్తిక‌ర‌మైన పేరును పెట్టుకున్న సంగ‌తి తెలిసిదే.

Tags:    

Similar News